Rythu Bandhu: తెలంగాణలో రైతు బంధు సంబురాలు.. త్వరలోనే రూ.50వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి..

Rythu Bandhu (tv5news.in)

Rythu Bandhu (tv5news.in)

Rythu Bandhu: తెలంగాణాలో వారం రోజులపాటు రైతు బంధు సంబరాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Rythu Bandhu: తెలంగాణాలో వారం రోజులపాటు రైతు బంధు సంబరాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పథకంప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో 50వేల కోట్ల రూపాయలు చేరనున్న సందర్బంగా ఈ సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. కోవిడ్ నిబంధనలకు నేపథ్యంలో పరిమితులను గుర్తుంచుకొని సంబరాలు చేపట్టాలని సూచించింది.

స్థానిక ఎమ్మెల్యేలు ముందుండి సంబరాలను నిర్వహించేలా చూడాలని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. పార్టీశ్రేణులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి నిరంజన్ రెడ్డీలు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జనవరి 3వ తేదీ నుంచి 10 తేదీ వరకు నిర్వహించి ముంగింపుసంబరాలు ఘనంగా చేపట్టాలని సూచించారు. దీనిలో భాగంగా ప్రతి ఇంటిముందు రైతు బంధుకు సంబంధించి ముగ్గులు వేయడం, విద్యార్ధులకు ఉపన్యాస, వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని తెలిపారు.

రైతు బంధు సంబరాల్లో భాగంగా ప్రతి గ్రామంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ఊరేగింపులతో మొదలు పెట్టి... రైతు వేదికల వద్ద పండుగ వాతావరణంలో ముంగింపుసంబరాలు నిర్వహించాలని మంత్రి పేర్కొన్నారు. దీనిలో భాగంగా సంబరాలను మీడియాలో.. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేపట్టాలని వెల్లడించారు. రైతు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేయాలని మంత్రి సూచించారు.

ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎమ్మెల్యేలకు అందిస్తామన్నారు. 63 లక్షల తెలంగాణ రైతులకు రైతు బంధు అందిస్తున్న అపురూప కార్యక్రమం ప్రపంచంలోనే లేదన్నారు. సాగు వైపు కొత్తతరాన్ని మళ్లించేందుకు ఆలోచించే ప్రతి ప్రభుత్వం రైతు బంధులాంటి కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ దూరదృష్టి, దార్శనికతతో ఈ కార్యక్రమాలు చేపట్టారని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story