బాలుడు కిడ్నాప్.. రూ.45 లక్షలు ఇస్తేనే బాబుని క్షేమంగా..

బాలుడు కిడ్నాప్.. రూ.45 లక్షలు ఇస్తేనే బాబుని క్షేమంగా..
10 బృందాలను రంగంలోకి దించి 100 మంది పోలీసులతో గాలింపు చర్యలు

డబ్బు సంపాదించడానికి మరో మార్గం కనిపించట్లేదేమో.. చిన్నారులను కిడ్నాప్ చేసి వారిని పావుగా వాడుకుంటున్నారు.. లక్షలు డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంటారు. అంత డబ్బు లేదని చెబితే పిల్లాడిని ఏంచేస్తారో అని అమ్మానాన్న కలవరపడుతుంటారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం కృష్ణ కాలనీలో నివసిస్తున్న కుసుమ రంజిత్ పెద్ద కుమారుడు దీక్షిత్ రెడ్డి(9)ని ఆదివారం సాయింత్రం గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఆడుకోవడానికలని బయటకు వెళ్లిన కుమారుడు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికారు.

దీక్షిత్‌తో కలిసి ఆడుకున్న భువన చంద్ర.. ఎవరో బైక్‌పై వచ్చి తన ఫ్రెండ్‌ని తీసుకెళ్లినట్లు చెప్పాడు. అనంతరం కిడ్నాప్ చేసిన వ్యక్తి రాత్రి 9.45 గంటలకు ఇంటర్నెట్ కాల్ చేసి రూ.45 లక్షలు ఇస్తే బాబుని వదిలిపెడతామని చెప్పారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. 10 బృందాలను రంగంలోకి దించి 100 మంది పోలీసులతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 5 సార్లు బాలుడి తల్లికి ఫోన్ చేసిన కిడ్నాపర్లు ఇంటర్నెట్ కాల్ చేస్తున్నారు.

బాలుడి తండ్రి రంజిత్ కిడ్నాపర్లతో తన దగ్గర రూ.2 లక్షలు మాత్రమే ఉన్నాయని తెలుపగా ఇటీవల రూ.45 లక్షలు పెట్టి కొన్న ప్లాట్ అమ్మి కట్టమని అడిగి వెంటనే ఫోన్ కట్ చేశాడు. తమ వద్ద అంత డబ్బు లేదని కిడ్నాపర్లను వేడుకుంటోంది. బాబుకు ఎలాంటి హానీ తలపెట్టవద్దని బాబు తల్లి వసంత కన్నీరుమున్నీరవుతోంది. పథకం ప్రకారమే కిడ్నాప్.. 15 రోజుల క్రితమే రెక్కీ నిర్వహించిన కిడ్నాపర్లు బాబుని మాటల్లో పెట్టి రూ.10 లు ఇచ్చి చాక్లెట్ కొనుక్కోమని అన్నారని దీక్షిత్ స్నేహితులు తెలిపారు. తమ్ముడు కూడా ఉన్నాడు వాడికీ చాక్లెట్ కొనుక్కోడానికి రూ.10 ఇవ్వమని అడిగేసరికి అతడితో చనువు పెంచుకున్నాడు. తెలిసిన వ్యక్తిగా పరిచయం పెంచుకుని ఇప్పుడు బైక్‌పై వచ్చి బండి ఎక్కమనగానే ఎక్కేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story