Munawar Faruqui : తెలంగాణలో కాకరేపుతోన్న మునావర్‌ షో..!

Munawar Faruqui : తెలంగాణలో కాకరేపుతోన్న మునావర్‌ షో..!
వివాదాస్పద స్టేండప్‌ కమిడియన్‌ మునావర్‌ ఫరుఖీ టూర్‌.. తెలంగాణలో కాకరేపుతోంది. కామెడీ షోలలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మునావర్‌..

వివాదాస్పద స్టేండప్‌ కమిడియన్‌ మునావర్‌ ఫరుఖీ టూర్‌.. తెలంగాణలో కాకరేపుతోంది. కామెడీ షోలలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మునావర్‌.. జనవరి 9వ హైదరాబాద్‌లో షో నిర్వహిస్తుండటంపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే 16 రాష్ట్రాలు నిషేధించిన వ్యక్తిని తెలంగాణలో ఎలా షో నిర్వహించుకోనిస్తున్నారని.. ప్రభుత్వంపై ఫైర్‌ అవుతున్నాయి.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జనవరి 9న షో నిర్వహిస్తున్నానని వారం క్రితం మునావర్‌ ఫరుఖీ ప్రకటించారు. దీన్ని స్వాగతించిన మంత్రి కేటీఆర్‌.. మునావర్‌తో పాటు మరో కమెడియన్‌ కునాల్‌ కమ్రాను హైదరాబాద్‌కు ఆహ్వానించారు. ఇప్పుడు ఇదే వివాదానికి దారిస్తోంది. మునావర్‌పై ముందునుంచి తీవ్ర ఆగ్రహంగా ఉన్న హిందూ సంఘాలు, బీజేపీ నేతలు.. కేటీఆర్‌ ఆహ్వానించడాన్ని తప్పుబడుతున్నారు.

మునావర్‌ను ఆహ్వానించడం ద్వారా హిందువులుకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రశ్నించగా.. హిందూ సమాజం కామెడీగా కనిసిస్తుందా అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు. రాముడిని, రామాయణాన్ని అవమానించిన మునావర్‌ను.. హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు.

జనవరిలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మునావర్‌ అరెస్ట్‌ అయ్యారు. హిందూ దేవుళ్లను అవమానిస్తూ మాట్లాడారని.. బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో 37 రోజులు జైల్లో ఉన్న మునావర్‌.. సుప్రీంకోర్టు బెయిల్‌ ఇవ్వడంతో బయటకొచ్చారు. అప్పటి నుంచి హిందూ సంఘాలు, బీజేపీ నేతలు.. మునావర్‌ షోలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం.. బెంగళూర్‌, గుర్‌గావ్‌, రాయ్‌పూర్‌, సూరత్‌, అహ్మదాబాద్‌, వడోదర, గోవా, ముంబైలలో మునావర్‌ ఫరుఖీ షోలు రద్దయ్యాయి.

హిందూ సంఘాల హెచ్చరికలతో నవంబర్‌ 28న బెంగళూర్‌లో జరగాల్సిన షో కూడా రద్దయ్యింది. మునావర్‌ చుట్టూ ఇంత వివాదం జరుగుతున్న నేపథ్యంలోనే.. మంత్రి కేటీఆర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌.. హైదరాబాద్‌, భోపాల్‌లలో షోలు చేసుకోవాడానికి ఆహ్వానించారు. ఇప్పుడిదే హిందూసంఘాల ఆగ్రహానికి కారణమవుతోంది. మరీ హైదరాబాద్‌లో షో జరుగుతుందో లేక మిగితా నగరాలలో మాదిరిగానే రద్దవుతుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story