TSRTC : నాలుగు నెలల్లో ప్రక్షాళన.. లేకపోతే ప్రైవేటీకరణే... ?

TSRTC : నాలుగు నెలల్లో ప్రక్షాళన.. లేకపోతే ప్రైవేటీకరణే... ?
రాష్ట్ర ఆర్టీసీ రాబోయే నాలుగు నెలల్లో గాడిన పడకపోతే దానిని ప్రైవేట్ పరం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు.

రాష్ట్ర ఆర్టీసీ రాబోయే నాలుగు నెలల్లో గాడిన పడకపోతే దానిని ప్రైవేట్ పరం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. మంగళవారం నిర్వహించిన సమీక్షలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్​లకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు ఆర్టీసీని రక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆదుకుందని.. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల కింద మూడు వేల కోట్లు కేటాయించిందని అయినప్పటికీ ఫలితాలు ఉండడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అందరు సమిష్టిగా కృషి చేస్తేనే ఆర్టీసీ మనుగడ సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలని అప్పుడే సంస్థ బాగుపడుతుందని ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. కాగా కరోనాతో పాటు పెరిగిన డీజీల్ ధరలు ఆర్టీసీ నష్టాలకు కారణమైనట్లు అధికారులు సీఎంకు వివరించినట్లుగా సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story