సినిమా థియేటర్లకు రీ ఓపెన్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

సినిమా థియేటర్లకు రీ ఓపెన్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌
తెలంగాణలో సినిమా థియేటర్లకు రీ ఓపెన్‌కు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఈనెల 23 నుంచి సినిమా థియేటర్లను తెరవాలని రాష్ట్ర ఎగ్జిబిటర్ల అసోసియేషన్ నిర్ణయించింది.

తెలంగాణలో సినిమా థియేటర్లకు రీ ఓపెన్‌కు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఈనెల 23 నుంచి సినిమా థియేటర్లను తెరవాలని రాష్ట్ర ఎగ్జిబిటర్ల అసోసియేషన్ నిర్ణయించింది. ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సితో అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని మల్టీఫ్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శనలు కొనసాగించాలని తీర్మానించినట్లు ఎగ్జిబిటర్ల అసోసియేషన్ కార్యదర్శి విజయేందర్ రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్ వల్ల థియేటర్లు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ఎగ్జిబిటర్లు తమ బాధలను ప్రభుత్వానికి విన్నవించారు.

తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దృష్టికి తీసుకెళ్లి వివరించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి థియేటర్లను ఆదుకునేందుకు స్పష్టమైన హామీ రావడంతో ఆదివారం నుంచి సినిమా హాల్స్ తెరవాలని తెలంగాణ ఫిల్మ్ చాంబర్, థియేటర్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సంయుక్తంగా నిర్ణయం తీసుకుంది. ఎగ్జిబిటర్లు ఎవరైనా రేపటి నుంచి సినిమాలను ప్రదర్శించుకోవచ్చని.. ఈ నెల 23 నుంచి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న దృష్ట్యా థియేటర్లు తెరుచుకోవచ్చని సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story