ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై తెలంగాణా హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై  తెలంగాణా హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై తెలంగాణా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉస్మానియా ఆస్పత్రిపై ప్రభుత్వం ఉన్నతస్థాయి నిర్ణయంతీసుకోవాలని సూచించింది.

ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై తెలంగాణా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉస్మానియా ఆస్పత్రిపై ప్రభుత్వం ఉన్నతస్థాయి నిర్ణయంతీసుకోవాలని సూచించింది. ఉన్నదాన్ని పునరుద్దరిస్తారా.? లేకా కొత్తది నిర్మిస్తారా అనేదాని పై త్వరలో ఓ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి తెలిపింది. దీనిపై నాలుగు వారాల్లోగా ప్రభుత్వ వైఖరి వెల్లడించాలని ఆదేశించింది.

ఉస్మానియా ఆస్పత్రి పునర్ నిర్మించాలి, చారిత్రక ఉస్మానియా ఆస్పత్రి కూల్చొద్దన్న పిల్స్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఆస్పత్రిని పునరుద్దరిస్తారా.. లేకా... కొత్తగా నిర్మిస్తారా అనేది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఐదేళ్లుగా ఎందుకు నిర్ణయం తీసుకోలేక పోయారని ప్రశ్నించింది. నాలుగు వారాల్లోగా ఉస్మానియా ఆస్పత్రి స్థలం, ప్లానుతో పాటు సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

Tags

Read MoreRead Less
Next Story