తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు

రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. మే 1 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 19 వరకు ఫస్టియర్ పరీక్షలు, మే2 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 1 ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, ఏప్రిల్ 3న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జరగనుంది. ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే టైం టేబుల్ వర్తిస్తుంది. మే14వ తేదీ రంజాన్ ఉన్నందున ఆ లోపు ముఖ్యమైన సబ్జెక్టులు పూర్తయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. మే 17 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలవుతాయని ప్రభుత్వం పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story