ఇద్దరమ్మాయిలతో ప్రేమ.. పెళ్లి..

ఇద్దరమ్మాయిలతో ప్రేమ.. పెళ్లి..
ఒకర్ని ప్రేమించి మరొకరి మెడలో తాళేం కట్టలేదు. నిజాయితీగా ఇద్దరికీ తన ప్రేమను పంచాడు. వాళ్లిద్దరూ అతడిని ప్రేమించాడు.

ఒకర్ని ప్రేమించి మరొకరి మెడలో తాళేం కట్టలేదు. నిజాయితీగా ఇద్దరికీ తన ప్రేమను పంచాడు. వాళ్లిద్దరూ అతడిని ప్రేమించాడు. దాంతో ఇద్దరికీ అతడిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే. ఇరు కుటుంబాలు కూడా ఈ పెళ్లికి పచ్చ జెండా ఊపారు. ఇంకేం ఉంది బంధువుల సమక్షంలో ఇరువురి మెడలో మూడు ముళ్లు వేసి అతిధుల ఆశీర్వాదాలు తీసుకున్నాడు అబ్బాయిగారు.

ఇటీవలి కాలంలో ఇలాంటి చిత్ర విచిత్రమైన వివాహాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ గిరిజన వ్యక్తి ఒకే సమయంలో ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం జూన్ 14 న జరిగింది. వరుడు అర్జున్ తన అత్తమామల ఇద్దరు కుమార్తెలను తెలంగాణలోని ఘన్పూర్ గ్రామంలో ఒకే 'మండపంలో' వివాహం చేసుకున్నాడు. అర్జున్ మొదట ఒక అత్త కుమార్తె ఉషా రాణితో ప్రేమలో పడ్డాడు.

తరువాత మరొక అత్త కుమార్తె సురేఖకు కూడా తన ప్రేమను పంచాడు. అయితే వీరి ప్రేమ వ్యవహారం రహస్యంగా నాలుగు సంవత్సరాలు కొనసాగింది. అయితే, అర్జున్ తల్లిదండ్రులు అతన్ని వివాహం చేసుకోవాలని కోరుకున్నప్పుడు రహస్యం బయటకు వచ్చింది. తాను ఇద్దరు అత్తల కుమార్తెలను ప్రేమిస్తున్నానని వారిని వివాహం చేసుకోవాలనుకుంటున్నానని అర్జున్ తల్లిదండ్రులకు చెప్పాడు. వారు అంగీకరించడంతో ఉషారాణి, సురేఖ తల్లిదండ్రులతో మాట్లాడి వారిని కూడా ఈ వివాహానికి ఒప్పించాడు. బాలికలు ఇద్దరూ కూడా తమకు బావని చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు.

"ఈ వివాహానికి అతని తల్లిదండ్రులు మరియు బాలికల కుటుంబాల నుండి ఎటువంటి అభ్యంతరం లేనందున, మేము ఈ వివాహాన్ని అంగీకరించాము అని వారి సంఘం సభ్యుడు ఒకరు చెప్పారు. ఈ వివాహం అసాధారణమైన వ్యవహారం కాదని, గిరిజన సమాజంలో ఇటువంటి వివాహాలు ఆమోదయోగ్యమని గ్రామంలోని కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు తెలిపారు.

"ఇది గిరిజన వర్గాలలో సాధారణం. ఒకేసారి ఇద్దరు మహిళలతో వివాహం చేసుకోవడం గిరిజన సంప్రదాయం. అయితే, ఈ రకమైన వివాహం హిందూ వివాహ చట్టంలో నేరం. "అని ఉత్నూర్ మండల ప్రజా పరిషత్‌కు చెందిన పంద్ర జైవంతరావు అన్నారు.

ఈ వివాహం తెలంగాణలోని ఘన్‌పూర్ అనే గ్రామంలో జరిగింది. ఇద్దరు వధువులు సాంప్రదాయ వివాహ వస్త్రాలను ధరించి, వారి సమాజంలోని ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story