టీచర్‌గా మారిన మంత్రి హరీష్‌రావు

టీచర్‌గా మారిన మంత్రి హరీష్‌రావు
పోలీసైతే ఏం చేస్తావంటూ ఓ విద్యార్థిని అడిగారు. ఈ ఆసక్తికరమైన ముచ్చట అందరినీ ఆకట్టుకుంది.

మంత్రి హరీష్‌రావు టీచర్‌గా మారిపోయారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెప్పారు. కరోనా అనంతరం స్కూళ్లు తెరుచుకున్న నేపథ్యంలో విద్యాబోధన ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లారు హరీష్. తర్వాత తెలుగు, లెక్కలు, సైన్స్ సబ్జెక్టుల్లో విద్యార్థుల ప్రావీణ్యత తెలుసుకునేందుకు వారికి కొన్ని ప్రశ్నలు వేశారు. డాక్టర్ అవ్వాలనుంది, పోలీస్ అవ్వాలనుంది అని చెప్పిన విద్యార్థుల్ని అభినందిస్తూనే అందుకు ఏం చేయాలో తెలుసా అంటూ ప్రశ్నలు వేశారు. పోలీసైతే ఏం చేస్తావంటూ ఓ విద్యార్థిని అడిగారు. ఈ ఆసక్తికరమైన ముచ్చట అందరినీ ఆకట్టుకుంది.

కరోనా సమయంలో చదువులకు తీవ్ర ఆకంటం కలిగిన నేపథ్యంలో పిల్లలంతా తిరిగి పుంజుకోవడం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు హరీష్‌రావు. విద్యార్థుల్ని బాగా సానబెట్టి చదివించాలని సూచించారు. స్థానిక MLA పద్మా దేవేందర్‌రెడ్డితోపాటు కలెక్టర్ హరీష్‌ మరికొందరు ఉన్నతాధారులు కూడా హరీష్ వెంట స్కూల్‌కి వెళ్లి పరిస్థితుల్ని పరిశీలించారు.


Tags

Read MoreRead Less
Next Story