Revanth reddy : కేసీఆర్ బతికి ఉన్నంత కాలం కేటీఆర్‌ సీఎం కాడు..!

Revanth reddy : కేసీఆర్ బతికి ఉన్నంత కాలం కేటీఆర్‌ సీఎం కాడు..!
టీడీపీ నేతగా తనను సంబోధిస్తూ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

టీడీపీ నేతగా తనను సంబోధిస్తూ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. 2017 అక్టోబర్ 31వ తేదీన తాను టీడీపీకి రాజీనామా చేశానని ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మెట్‌‌‌‌లో రాజీనామా లేఖను చంద్రబాబుకు అందజేశానని చెప్పారు. అలాగే గన్‌‌మెన్లను ఎస్పీకి సరెండర్ చేశానని.. పీఏను కూడా సరెండర్ చేసి బ్యాంకు ఖాతాను క్లోజ్ చేశానని రేవంత్‌ వెల్లడించారు. అప్పట్లో పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహిస్తున్నందుకే స్పీకర్‌‌ను కలవలేదని చెప్పారు. తనకు టీడీపీ ద్వారానే ఎమ్మెల్యే పదవి వచ్చింది కాబట్టి పార్టీ అధ్యక్షుడికి లేఖ ఇచ్చానని తెలిపారు.

తనను టీడీపీ అంటున్న టీఆర్‌ఎస్‌ నాయకులు కేసీఆర్‌ ఎవరో చెప్పాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. తాను చంద్రబాబుకు సహచరునిగా పని చేశానని.. కానీ కేసీఆర్‌‌‌ది బానిస బతుకు అని విమర్శించారు. ఇప్పుడున్న కేబినెట్ మొత్తం టీడీపీనే కదా అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌తో పాటు తలసాని, ఇంద్రకరణ్, పోచారం, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకరరావు, కొప్పుల ఈశ్వర్ ఇలా అందరూ టీడీపీ వాళ్లే కదా అన్నారు. ఇక ఇప్పుడు గతి లేక టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను తీసుకుంటున్నారని రేవంత్‌ మండిపడ్డారు. 2022 ఆగస్టు తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వాన్ని రద్దు చేస్తాడని పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు.

మోసం, దోపిడీకి మారు పేరు కల్వకుంట్ల కుటుంబం అని రేవంత్‌ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. భార్య , పిల్లలను తీసుకుపోయి.. సోనియా గాంధీ కాళ్ల మీద పడి పార్టీని విలీనం చేస్తానని మోసం చేశాడని మండిపడ్డారు. కేటీఆర్ కు తారకరామారావు పేరు పెట్టుకునే అర్హత లేదని... అరువు తెచ్చుకున్న పేరు పెట్టుకొని ఇతరులను ప్రశ్నిస్తాడా అంటూ రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 610 జీవో ప్రకారం వెళితే కేటీఆర్ కు చెప్రాసి పదవి కూడా రాదన్నారు. తనను విమర్శిస్తే వాళ్ల నాన్నను విమర్శించినట్లే అన్నారు.

కల్వకుంట్ల కుటుంబం చేసిన దోపిడీ సొత్తును తరిమి తరిమి కొట్టి గుంజుకుంటామన్నారు. తనకు పీసీసీ పదవి వస్తే కేటీఆర్‌కు ఏం నొప్పి అని ప్రశ్నించారు. కేటీఆర్ లాగా తండ్రి నుంచి పదవులు తెచ్చుకోలేదని సొంతంగా కష్టపడి పీసీసీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగానన్నారు. తాను పీసీసీ పోస్టును పైసలు పెట్టి కొంటే వాళ్ల తండ్రి కేంద్ర మంత్రి పదవిని ఎన్ని పైసలకు తెచ్చుకున్నాడో చెప్పాలన్నారు టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వదిలేది లేదని... మున్ముందు వాళ్ల పై కార్యాచరణ ఉంటుందని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story