25 మంది అభ్యర్థులతో టీఆర్ఎస్ తుది జాబితా..

25 మంది అభ్యర్థులతో టీఆర్ఎస్ తుది జాబితా..

25 మంది అభ్యర్థులతో కూడిన తుది జాబితాను టీఆర్ఎస్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈ జాబితాలో 17 మంది సిట్టింగ్ కార్పొరేట్ లకు మొండిచేయి చూపించింది అధిష్టానం. వారి స్థానాల్లో కొత్తవారికి సీట్లు కేటాయించింది. దీంతో సిట్టింగ్ కార్పొరేట్ లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 8 మంది సిట్టింగ్ లకు మాత్రం మరోసారి అవకాశం ఇచ్చింది. ఇక మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవికి చర్లపల్లి టికెట్, ఉప్పల్ ఎమ్మెల్యే భార్య స్వప్నారెడ్డికి హబ్సిగూడ టికెట్, మరో ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యనందితకు కవాడిగూడ టికెట్ దక్కింది.

అత్తాపూర్ లో రావుల విజయ స్థానంలో మాధవి అమరేందర్ కు టికెట్ కేటాయించగా.. ఉప్పల్ లో మేకల అనలారెడ్డి స్థానంలో అరటికాయల భాస్కర్ కు ఛాన్స్ ఇచ్చారు. చిలకనగర్ లో గోపు సరస్వతికి హ్యాండ్ ఇవ్వగా బన్నల ప్రవీణ్‌ ముదిరాజ్ కు ఛాన్స్ దొరికింది. మీర్ పేట్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గొల్లురి అంజయ్య స్థానంలో జేరిపోతుల ప్రభుదాస్ కు టికెట్ దక్కింది. తార్నాకలో అలకుంట సరస్వతి స్థానంలో మోతె శ్రీలత.. వెంగళరావు నగర్ లో కిలారి మనోహర్ స్థానంలో దే దీప్యరావుకు టికెట్లు దక్కాయి. కాచిగూడలో ఎక్కాల చైతన్య స్థానంలో శిరీషా యాదవ్.. అంబర్ పేటలో పులి జగన్ స్థానంలో విజయ్ కుమార్ గౌడ్ కు ఛాన్స్ దక్కింది. యూసుఫ్ గూడలో సంజయ్ గౌడ్ స్థానంలో రాజ్ కుమార్ పటేల్ కు ఛాన్స్ దక్కగా.. రహ్మత్ నగర్ లో అబ్దుల్ షఫీ స్థానంలో సీఎన్ రెడ్డికి టికెట్ దక్కింది.

ఇక నేరేడ్ మెట్ లో శ్రీదేవి స్థానంలో మీనా ఉపేందర్ కి అవకాశం వచ్చింది. ఈస్ట్ ఆనంద్ బాగ్ లో ఆకుల నర్సింగ్ రావు స్థానంలో ప్రేమ్ కుమార్ కు టికెట్ కేటాయించారు. గౌతమ్ నగర్ లో శిరీష్ స్థానంలో మేకల సునీత రాము యాదవ్.. గోల్నాకలో కాలేరు పద్మ స్థానంలో దూసరి లావణ్యకు లిస్టులో చోటు దక్కింది. చందానగర్ లో బోబ్బా నవతారెడ్డి స్థానంలో మంజులా రఘనాథ్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వగా.. హైదర్ నగర్ లో వెంకటసత్య సూర్య రామరాజు స్థానంలో నార్నే శ్రీనివాస్ కు అవకాశం దక్కింది.

Tags

Read MoreRead Less
Next Story