మేయర్‌ అభ్యర్థి ఎంపికపై ఫోకస్‌ పెట్టిన టిఆర్ఎస్

మేయర్‌ అభ్యర్థి ఎంపికపై ఫోకస్‌ పెట్టిన టిఆర్ఎస్

గ్రేటర్‌ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా నిలిచిన అధికార టీఆర్‌ఎస్.. మేయర్‌ అభ్యర్థి ఎంపికపై ఫోకస్‌ పెట్టింది. మేయర్‌ పదవి జనరల్‌ మహిళకు కేటాయించడంతో.. ఎవర్ని మేయర్‌ చేయాలి..? ఎలా ముందుకెళ్లాలి అన్నదానిపై అధిష్టానం దృష్టి పెట్టింది. టిఆర్‌ఎస్‌కు చెందిన ఎక్స్ అఫిషియోసభ్యుల ఓటుతో గ్రేటర్‌పీఠం దక్కించుకోవాలా? ఎంఐఎంతో స్నేహం కుదుర్చుకుని రాజకీయ సర్దుబాటు చేసుకావాల అనే అంశంపై పార్టీలో చర్చించనున్నారు.

ఈ నేపథ్యంలో గెలిచిన కార్పొరేటర్లు, జిహెచ్‌ఎంసి పరిధిలోని టిఆర్‌ఎస్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రాజ్యసభ, లోక్ సభ సభ్యులతో మంత్రి కేటీఆర్‌ సమావేశం కానున్నారు. పాలకమండలి గడువు, మేయర్ అభ్యర్థి, ఎంఐఎంతో రాజకీయ సర్దుబాటు వంటి అంశాల్లో సమీక్ష జరగనుంది.

జిహెచ్‌ఎంసి చట్టాల్లో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుని ప్రస్తుత పాలకమండలిని రద్దుచేసి కొత్త పాలక మండలిని ఏర్పాటుచేయాలా? లేదా.... ఫిబ్రవరి 10 వరకు పాతపాలక మండలినే కొనసాగించాలనే అంశాలపై కూడా టిఆర్‌ఎస్ పార్టీ సమీక్షలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story