ఎమ్మెల్సీ ఎన్నికల్లో లక్ష ఓట్ల టార్గెట్‌ పెట్టుకున్న టీఆర్‌ఎస్‌

ఎమ్మెల్సీ ఎన్నికల్లో లక్ష ఓట్ల టార్గెట్‌ పెట్టుకున్న టీఆర్‌ఎస్‌
తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కొన్నిరోజులే మిగిలి ఉంది. ఈ లోపు తమ బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది టీఆర్‌ఎస్

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కొన్నిరోజులే మిగిలి ఉంది. ఈ లోపు తమ బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది టీఆర్‌ఎస్‌. గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం గతంలో ఓటర్ ఎనో రోల్ చేపట్టలేదు. అందుకే గత ఎన్నికల్లో ఓటమి దృష్ట్యా ఈ సారి పకడ్బందీగా గ్రాడ్యుయేట్ ఓటర్ ఎన్ రోల్ డ్రైవ్ నిర్వహించింది. ఎన్ రోల్ చేయించిన ఈ ఓట్లు పడితే చాలు తమ గెలుపు ఖాయమైనట్లేనని అంచానా వేస్తోంది టీఆర్‌ఎస్‌.

హైదరాబాద్ ,రంగారెడ్డి ,మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ పరిధిలో అయిదున్నర లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వరంగల్ ,ఖమ్మం ,నల్గొండ గ్రాడ్యుయేట్ పరిధిలో నాలుగున్నర లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో కూడా లక్ష ఓట్ల చొప్పున పార్టీ కి ఓట్లు పోలైనా గెలుపు ఈజీ అని టిఆర్ఎస్ హైకమాండ్‌ అంచనా వేస్తోంది.

గ్రాడ్యుయేట్లను ఆకట్టుకునేందుకు వ్యూహాలను అమలు చేస్తుంది గులాబీ దళం. ముందు గా పార్టీ నేతలు ఎన్ రోల్ చేయించిన ఓటర్లను కలిసి వాళ్ళ ఓటు పార్టీ అభ్యర్థికి పడేలా చూడడం, మొదటి సారి గ్రాడ్యుయేట్ ఓటు వేసే ఓటర్లను కలిసి తమకు ఓటు వేయాలని కోరడంతో పాటు పోలైయ్యే ఓట్లలో సగం పార్టీ అభ్యర్థికి పడేలా పథకం రచిస్తున్నారు. ప్రభుత్వం పై అసంతృప్తి గా ఉన్న వర్గాలను పక్కన పెట్టి తట్టస్థంగా ఉండే వర్గాలను ,పార్టీ కి అనుకూలంగా ఉండే వర్గాల ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్రతీ 50మంది ఓటర్లకు ఒక్కో వ్యక్తి కి పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఈ ఓట్లను వేయించే బాధ్యత ఆ ఒక్క వ్యక్తే చూసుకుంటున్నాడు. ఇలా గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనున్న 6 జిల్లా లలో వేలాది టీం లు ఏర్పాటు చేసి పకడ్బంది ప్రణాళికతో ముందుకెళ్తోంది టీఆర్‌ఎస్‌. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 50 శాతం మించి ఓట్లు పోలైయ్యే అవకాశం లేదని ,కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు కింద లక్ష ఓట్లు పార్టీ సాధించగలిగితే గెలుపు నల్లేరుమీద నడకే అని అంచనా వేస్తున్నారు. మరి ఈ వ్యూహం ఏమేరకు ఫలిస్తోంది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story