సిద్దిపేటలో వార్‌ వన్‌సైడ్.. !

సిద్దిపేటలో వార్‌ వన్‌సైడ్..  !
తెలంగాణలో 2 కార్పొరేషన్లు , 5 మున్సిపాలిటీలకు కౌంటింగ్ కొనసాగుతోంది. వరంగల్ కార్పొరేషన్‌లో TRS ఆధిక్యంలో దూసుకెళ్తోంది.

తెలంగాణలో 2 కార్పొరేషన్లు , 5 మున్సిపాలిటీలకు కౌంటింగ్ కొనసాగుతోంది. వరంగల్ కార్పొరేషన్‌లో TRS ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మొత్తం 66 డివిజన్లకు గానూ గులాబీ పార్టీ ఇప్పటికే 23 చోట్ల విజయం సాధించింది. బీజేపీ-3 చోట్ల గెలుపొందగా... కాంగ్రెస్ కేవలం ఒక్కస్థానానికే పరిమితం అయింది. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది... ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 20 డివిజన్ల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో 12 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. కాంగ్రెస్ 4 చోట్ల గెలుపొందగా.. బీజేపీ- 1, సీపీఐ- 2, సీపీఎం-1 డివిజన్లలో విజయం సాధించాయి.

ఇక ఐదు మున్సిపాల్టీల్లోనూ కౌంటింగ్ కొనసాగుతోంది... సిద్దిపేటలో టీఆర్ఎస్ దూసుకెళ్తోంది. మొత్తం 43 వార్డులకుగానూ ఇప్పటికే 19 వార్డుల్లో విజయం సొంతం చేసుకొంది..జడ్చర్ల, నకిరేకల్‌లోనూ గులాబీ పార్టీ ఆధిక్యంలో ఉంది. నకిరేకల్‌లో 20 వార్డులుండగా... TRS-11, కాంగ్రెస్-2 చోట్ల విజయం సాధించాయి.... ఇక జడ్చర్లలో గులాబీ పార్టీ 16 వార్డుల్లో విజయం సాధించింది. బీజేపీ 2 వార్డులు, కాంగ్రెస్ -1 చోట గెలుపొందాయి. కొత్తూరు, అచ్చంపేటలోనూ కారుదే ఆధిపత్యం. అయితే ఈ రెండు మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ కూడా కొంత పోటీ ఇస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story