MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు.. ఎవ్వరికీ తెలియకుండా నామినేషన్..

MLC Elections (tv5news.in)

MLC Elections (tv5news.in)

MLC Elections: టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైంది.

MLC Elections: టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైంది. ఢిల్లీ వెళ్లే ముందు 12మంది అభ్యర్దులను అధినేత ఖరారు చేసినట్టు సమాచారం. అయితే వారి పేర్లను అధిష్టానం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆశావహుల సంఖ్య ఎక్కువ ఉండటంతో ఆయా జిల్లాల మంత్రులకు అభ్యర్థుల పేర్లు చెప్పినట్టు సమాచారం.

ఎమ్మెల్యే కోటా అభ్యర్థులను ప్రకటించకుండానే నామినేషన్ వేయించినట్లుగా.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. వెళ్లే ముందే అతి ముఖ్యమైన ఓ పనిని పూర్తి చేసి వెళ్లారు. స్థానిక సంస్థల కోటా లోని 12 స్థానాలకు ఈ నెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.

23వ తేదీతో నామినేషన్లు గడువు ముగియనుండటంతో.. తన ఢిల్లీ పర్యటనకు ముందే జాబితాను కేసీఆర్‌ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది . 12 స్థానాల్లో కొందరిని మాత్రమే రెన్యువల్ చేసి సగం కొత్తవారికి అవకాశం ఇచ్చినట్లు సమాచారం. పలువురు అభ్యర్దుల బిఫామ్ లు ఆయా జిల్లాల మంత్రులకు అప్పగించారు. సోమ, మంగళ వారాల్లో పలువురు అభ్యర్దులు నామినేషన్లు వేయనున్నారు.

ఆదిలాబాద్ నుంచి దండే విఠల్, మహబూబ్ నగర్ నుంచి సాయిచంద్, కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తాత మధు, రంగారెడ్డి నుంచి శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి లకు అవకాశం దక్కనుంది. వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.. నల్గొండ నుంచి ఎం సి కోటిరెడ్డి, మెదక్ నుంచి డాక్టర్ యాదవ రెడ్డి పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం.

ఇక కరీంనగర్ నుంచి అందరూ ఊహించినట్లుగానే ఎల్ రమణ, భాను ప్రసాద్ రావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత అభ్యర్థిత్వం పై ఇంకా క్లారిటి లేదు. రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ ముదిరాజ్ ను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గా నామినేషన్ వేయడంతో ఆ స్థానంలో ఎమ్మెల్సీ కవితను రాజ్యసభకు పంపిస్తారు అని ప్రచారం జరుగుతోంది.

అయితే ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలోని ఆరు స్థానాల్లో 3 రెడ్డి సామాజిక వర్గానికి దక్కగా.. ఇప్పుడు స్థానిక సంస్థల కోటాలో కూడా రెడ్డి సామాజిక వర్గంలో మరో ఐదుగురికి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది . ఇప్పటికే ఎమ్మెల్యే కోటలోని ఆరు స్థానాలు భర్తీ కావడం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానం కూడా మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఇవ్వటం.. స్థానిక సంస్థల కోటలోని 12 స్థానాలకు కూడా అభ్యర్థులు ఫైనల్ అయినట్టుడటంతో పెద్దల సభలో అడుగు పెట్టాలని భావించిన పలువురు ఆశావహులకు నిరాశే మిగిలింది.

Tags

Read MoreRead Less
Next Story