రాహుల్‌గాంధీకే డ్రగ్స్‌ చరిత్ర, విదేశాల్లో పట్టుబడిన చరిత్ర ఉంది : ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి

రాహుల్‌గాంధీకే డ్రగ్స్‌ చరిత్ర, విదేశాల్లో పట్టుబడిన చరిత్ర ఉంది : ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి
మంత్రి కేటీఆర్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పై ఫైర్‌ అయింది టీఆర్‌ఎస్‌.

మంత్రి కేటీఆర్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పై ఫైర్‌ అయింది టీఆర్‌ఎస్‌. మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యేలు జీవన్‌ రెడ్డి, గువ్వల బాలరాజు, గ్యాదరి కిషోర్‌... రేవంత్‌రెడ్డి పై విరుచుకుపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఎవరి కాళ్లో పట్టుకుని పదవి తెచ్చుకున్న రేవంత్‌...అక్రమంగా సంపాదించిన డబ్బును కాపాడుకోవడానికి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని జీవన్‌రెడ్డి అన్నారు. రాహుల్‌గాంధీకే డ్రగ్స్‌ చరిత్ర ఉందని, గతంలోనే అతను విదేశాల్లో పట్టుబడిన విషయాన్ని బయటపెట్టారు. రేవంత్‌కు కేటీఆర్‌ ను విమర్శించే కనీస స్థాయి లేదన్నారు గువ్వల బాలరాజు, గ్యాదరి కిషోర్‌. రాహుల్‌ను వైట్‌ ఛాలెంజ్‌ కు ఒప్పించే దమ్ము రేవంత్‌కు ఉందా అని ప్రశ్నించారు. కేటీఆర్ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అయితే రేవంత్ బ్లాక్ మెయిల్‌‌కు బ్రాండ్ అంబాసిడర్ అంటూ మండిపడ్డారు. కాగా నిన్న రేవంత్‌‌రెడ్డి రాకతో గన్‌ పార్క్‌ అపవిత్రం అయిందంటూ అమరుల స్థూపాన్ని టీఆర్ఎస్ శ్రేణులు పాలతో శుద్దీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story