TRS : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో పీకే ఫీవర్.. పాజిటివ్ రిపోర్టు ఉంటేనే టికెట్..!

TRS : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో పీకే ఫీవర్.. పాజిటివ్ రిపోర్టు ఉంటేనే టికెట్..!
TRS : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఇప్పుడు పీకే ఫీవర్ పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో టికేట్ దక్కాలంటే పీకే పాజిటివ్ రిపోర్టు ఉండాలి.

TRS : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఇప్పుడు పీకే ఫీవర్ పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో టికేట్ దక్కాలంటే పీకే పాజిటివ్ రిపోర్టు ఉండాలి. లేకుంటే టికేట్ గల్లంతే.. గత ఎన్నికల్లో ఎక్కువమార్పులు చేయకుండానే .. ఎమ్మెల్యేలందరికి మరోదఫా ఛాన్స్ ఇచ్చారు.. కేసీఆర్ చరిష్మాతో ముందస్తు ఎన్నికల వ్యూహంతో ఎమ్మెల్యేల పై వ్యతిరేకత ఉన్నా.. గెలుపొందారు..ఈసారి మూడోసారి అధికారంకోసం కేసీఆర్..పీకే టీంను నమ్ముకున్నారు. ఐపాక్ తో విస్తృతంగా సర్వేలు నిర్వహించారు.. ఇప్పటికే 80 శాతం ఎమ్మెల్యేలు రెండుసార్లు ఆయా నియోజకవర్గాలనుంచే ఎన్నికవుతు వస్తున్నారు.. మూడోసారి టికెట్ దక్కాలంటే చాలమందికి కష్టమే అంటున్నారు.. పీకే రిపోర్టుతోనే ఎమ్మెల్యేల భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు కేసీఆర్.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ,..తన పాలన తోపాటు ఎమ్మెల్యేల పనితీరు పై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి .. తగు సూచనలు సలహాలు ఇస్తుంటారు. 2014లో మొదటిసారి అధికారంలో వచ్చినప్పటినుంచి.. వివిధ ఏజేన్సీలతో సర్వేలు నిర్వహించి..టీఆర్ఎస్ ఎల్పీలో ప్రొగ్రేస్ రిపోర్టు విడుదలచేస్తుంటారు.. ఎమ్మెల్యేల పనితీరును మెరుగుపరుచుకోవాలని హితబోద చేస్తుంటారు. పనితీరులో ఎవరూ ఫస్ట్ ఎవరూ లాస్ట్ అనే అంశాలను సైతం ప్రొగ్రెస్ రిపోర్టు లో పొందుపరుస్తారు.. 2018 ఎన్నికలముందు సైతం 35 మంది ఎమ్మెల్యేల తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికి .. అసెంబ్లీ రద్దుచేసి ముందుస్తు ఎన్నికలకు వెళ్లారు.

105 మందితో అభ్యర్దుల లిస్ట్ ప్రకటించారు. కొండా సురేఖ, బొడిగే శోభ, నల్లాల ఓదేలు, మేడ్చల్ సుధీర్ రెడ్డి, కనకరావు ల స్థానంలో నన్నపనేని నరేందర్ ,సుంకేరవి, బాల్క సుమన్, మల్లారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు లకు టికెట్లు కేటాయించారు. కేసీఆర్ వ్యూహాలముందు ప్రతిపక్షాలు నిలబడకపోవడంతో .. 2014 సాధించిన సీట్ల కన్నా ఎక్కువ స్ధానాలు గెలిచి మరోసారి అధికారంలోకి తీసుకువచ్చారు.. ఎమ్మెల్యేల పై ఉన్న వ్యతిరేకేత.. కేసీఆర్ చరిష్మాతోపాటు ప్రభుత్వ పదకాలైన రైతుబందు , మిషన్ కాకతీయ, మిషన్ భగీరద , కళ్యాణలక్ష్మి , వంటి పధకాలు పాజిటివ్ అంశాలుగా గెలుపుకు దోహద పడ్డాయి.. బీజేపీకి గత అసెంబ్లీలో ఐదు స్ధానాలు ఉన్నప్పటికి.. 2018 లో కేవలం ఒక్క స్థానానికే పరిమితమయింది. కాంగ్రెస్ లో సైతం హేమాహేమీలు ఓఢిపోయారు.. పద్నాలుగు మంది ఎమ్మెల్యులగా గెలిచారు.. 88 సీట్లు గెలిచి తిరుగులేని విజయాన్ని టీఆర్ఎస్ పొందింది...

రెండోసారి అధికారంలోకి వచ్చాక.. సైతం సర్వేలు నిర్వహిస్తున్నారు, అయితే 2018 తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 4 స్ధానాలు గెలుపొందింది.. ఆ తర్వాత దుబ్బాక , జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో హవా సత్తా చాటింది.. హుజూర్ నగర్ , నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపొందింది .. బీజేపీ గెలుపులో సోషల్ మీడియా పాత్ర విశేషంగా ఉంది.. యువత లక్ష్యంగా సోషల్ మీడియాలో బీజేపీ ప్రచారం ఆపార్టీ కి ప్లస్ అయిందని టీఆర్ఎస్ బలంగా నమ్ముతుంది.. అందుకే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ సేవలను వినియోగించుకుంటుంది.. ఇప్పటికే పీకే టీం అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది.. ప్రభుత్వ పధకాల అమలు, ప్రజల మనోగతం, ఎమ్మెల్యేల పనితీరు, ప్రధాన ప్రత్యర్దుల బలాలు ఇలా సమగ్ర వివరాలతో పీకే టీం కేసీఆర్ కు రిపోర్టు అందించింది.. ఆ రిపోర్టే .ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతోంది.. వివాదస్పద ఎమ్మెల్యేలు, అవినీతి ముద్రపడ్డ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు గల్లంతనే ప్రచారం ఊపందుకుంది.. 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలను మార్చితేనే .. మూడోసారి గెలుపు అవకాశాలంటాయనేది సర్వే సారాంశం..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ గత ఎన్నికల్లో పదిసీట్లకు గాను.. ఆసిఫాబాద్ మినహా అన్ని చోట్ల గెలుపొందింది.. ఆసిఫాబాద్ లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్ది ఆత్రం సక్కు అనంతరం టీఆర్ఎస్ లోచేరారు.. పదిమంది ఎమ్మెల్యేల్లో దాదాపు నాలుగుచోట్ల తీవ్ర వ్యతిరేకత ఉందంటున్నారు.. రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు, వివాదస్పద అంశాలు ఆయా ఎమ్మెల్యేల పట్ల మైనస్ అని ఐపాక్ రిపోర్టు ఇచ్చినట్టు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పదమూడు స్థానాలకు గాను.. మందని, రామగుండం మినహా అన్ని చోట్ల టీఆర్ఎస్ గెలుపొందింది.. రామగుండం ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరారు.. హుజూరాబాద్ ఎమ్మెల్యే గా ఎన్నికైన ఈటెల రాజేందర్ ...తర్వాత పార్టీకి రాజీనామా చేసి..బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.. ఇక్కడ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై పౌరసత్వ వివాదం కోర్టులో కేసు నడుస్తోంది. ఇక్కడ అభ్యర్ది మారవచ్చంటున్నారు.. మరో రెండు నియోజకవర్గాల్లో సైతం గత ఎన్నికల్లో వ్యతిరేకత ఉన్నప్పటికి టికెట్ కేటాయించారు.. ఈసారి టికెట్ డౌటంటున్నారు..మూడోసారి టికెట్ ఇవ్వడం కష్టమంటున్నారు..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యెల్లారెడ్డిలో కాంగ్రెస్ మిగితా చోట్ల టీఆర్ఎస్ గెలుపొందింది.. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరారు.. బాన్సువాడలో స్పీకర్ పోచారం ప్రాతినిధ్యం వహిస్తున్నారు..ఈసారి ఆయన కుమారుడు పోటి చేయవచ్చంటున్నారు.. మరో నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పై వ్యతిరేకత ఉన్నప్పటికే ... వారికి ఆల్టర్నేటివ్ పార్టీలో లేకపోవడం వారికి ప్లస్ అవుతుందంటున్నారు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ , నర్సాపూర్ లో వయోభారం దృష్టా కొత్తవారికి అవకాశం రావచ్చంటున్నారు.. మరో సిట్టింగ్ స్థానంలో వ్యతిరేకత ఉండటంతో అబ్యర్ది మార్పు తప్పదంటున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలలో సైతం నాలుగు చోట్ల అభ్యర్దుల పై వ్యతిరేకతోపాటు .. పార్టీలో అంతర్గత విబేదాలు, మంత్రులతో పొసగకపోవడం తో టికేట్లు డౌటే అంటున్నారు.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాలుగు చోట్ల వ్య,తిరేకత ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.. ఇందులో ఇద్దరు తొలిసారి గెలిచినవారు కాగా..మరో ఇద్దరు రెండుసార్లు గెలిచిన వారున్నట్టు సమాచారం.. ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలో సైతం మూడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పై నెగిటివ్ రిపోర్టు ఉన్నట్లు తెలుస్తోంది.. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే బదులు ఈసారి సతీమణి బరిలో దింపడం ద్వారా వ్యతిరేకత ను తగ్గించుకోవచ్చని అంటున్నారు. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో సైతం అభ్యర్దుల మార్పు తప్పదంటున్నారు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో ఖమ్మం మినహా అంతటా అభ్యర్దులు ఒటమి చెందారు.. కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు కారెక్కారు..ఇప్పుడు వారి పరిస్దితి అంతా ఈజీగా లేదంటున్నారు. ఇక రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో పెద్దగా వ్యతిరేకత లేనప్పటకి .. ఇతర పార్టీలనుంచి చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జీహెచ్ఎంసీ ఫలితాలు షాక్ కు గురిచేశాయి.. హైదరాబాద్ , మల్కాజిగిరి, చేవేళ్ల పార్రమెంట్ పరిధిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలపై మాత్రమే వ్యతరికత ఉన్నట్టు తెలుస్తోంది.

ఓవరాల్ గా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్దులుఎవరనేది.. పీకే చేతుల్లో ఉందని అంటున్నారు.. ఐపాక్ టీఎం సర్వే ఆధారంగా టికెట్ కేటాయింపు జరగుతుందనే ప్రచారం అభ్యర్దుల్లో గుబులు రేపుతోంది.. సో పీకే రిపోర్టుతో తీవ్ర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల టికెట్లు గల్లంతు అవడం ఖాయమనిపిస్తోంది.


మార్గం శ్రీనివాస్

తెలంగాణ ఇన్ పుట్ ఎడిటర్

Tags

Read MoreRead Less
Next Story