రెండో జాబితాలో ఈ సిట్టింగ్‌లకు టీఆర్‌ఎస్‌ నోఛాన్స్..

రెండో జాబితాలో ఈ సిట్టింగ్‌లకు టీఆర్‌ఎస్‌ నోఛాన్స్..
టీఆర్‌ఎస్‌ రెండో జాబితాలో పలువురు సిట్టింగ్‌లను మార్చింది టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌. దీంతో పాటు... మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక సైతం టీఆర్‌ఎస్‌కు సవాల్‌గా మారింది..

టీఆర్‌ఎస్‌ రెండో జాబితాలో పలువురు సిట్టింగ్‌లను మార్చింది టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌. దీంతో పాటు... మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక సైతం టీఆర్‌ఎస్‌కు సవాల్‌గా మారింది. మైలార్‌ దేవ్‌పల్లి సిట్టింగ్‌ కార్పోరేటర్‌ తోకల శ్రీనివాస్‌రెడ్డి బీజేపీలో చేరడంతో.. అక్కడ ప్రేమదాస్‌గౌడ్‌కు ఛాన్స్‌ ఇచ్చింది. అటు బాలానగర్‌ సిట్టింగ్‌ సీటు నరేంద్రాచార్యాను మార్చి... ఆవుల రవీందర్‌రెడ్డికి అవకాశం ఇచ్చింది. 122వ వార్డు వివేకానందనగర్‌ సిట్టింగ్‌ సీటు సైతం మార్చారు. డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు... మూడు సిట్టింగ్‌ సీట్లను పట్టుబట్టి మార్పించినట్లు తెలుస్తోంది. 142 అడ్డగుట్ట, 146 మెట్టుగూడ, 146 బౌద్దనగర్‌లో సిట్టింగ్‌ సీట్లను మార్చారు. ఇక.. 149వ వార్డు బేగంపేట సిట్టింగ్‌ సీటును సైతం మార్చింది టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌.

మరోవైపు... 3 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో .. అభ్యర్ధుల ఎంపిక సవాల్‌గా మారింది. జూబ్లీహిల్స్‌ మాగంటి గోపినాథ్‌ నియోజకవర్గంలో యూసఫ్‌గూడ, వెంగళరావునగర్‌, రెహ్మత్‌నగర్‌ సీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. యూసఫ్‌గూడాలో సంజయ్‌, వెంగళరావునగర్‌లో కిలారీ మనోహర్‌లపై ఎమ్మెల్యే మాగంటిగోపినాథ్‌ తీవ్ర అసంతృప్తి ఉండటంతో... వీటిని పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఉప్పల్‌ బేతి సుభాష్‌రెడ్డి నియోజకవర్గంలోనూ... ఏడు సీట్లు పెండింగ్‌లో పెట్టింది టీఆర్‌ఎస్‌. నాచారం, హబ్సీగూడ, ఉప్పల్‌, చర్లపల్లి, చిలకనగర్‌, హౌసింగ్‌బోర్డు, ఎఎస్‌రావునగర్‌ సీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. నాచారంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన శాంతి సాయిజన్‌ శేఖర్‌... ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌నుంచి పోటీ చేసి ఓడిన మేడల జ్యోతి మల్లికార్జున సైతం సీటు ఆశిస్తుండటంతో... ఈ సీటును పెండింగ్‌లో పెట్టింది గులాబీ పార్టీ. ఇక మేయర్‌ పోటీలో ఉన్న బొంతు రామ్మోహన్‌ భార్య సైతం.. చర్లపల్లి సీటు ఆశిస్తుండంటంతో.. దీన్ని కూడా పెండింగ్‌లో పెట్టింది టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌.... అటు.. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ నియోజకవర్గంలో...నల్లకుంట, అంబర్‌పేట, అడిక్మేట్‌, గోల్మాక, కాచిగూడ, కావాడిగూడ,ముషీరాబాద్‌ స్థానాలు పెండింగ్‌లో పెట్టారు. అంబర్‌పేట కిషన్‌రెడ్డి నియోజవర్గం కావడంతో... ఈ స్థానాల్లో బీజేపీ ఎవరికి సీటు ఇస్తుందో చూశాక.. అభ్యర్ధుల పేర్లు ప్రకటించాలని టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ డిసైడ్‌ అయింది.

Tags

Read MoreRead Less
Next Story