TRS : బీజేపీ సోషల్ మీడియా ముందు నిలబడాలంటే.. టీఆర్ఎస్‌కు ఐప్యాక్ సేవలే శరణ్యమా..?

TRS :  బీజేపీ సోషల్ మీడియా ముందు నిలబడాలంటే..  టీఆర్ఎస్‌కు  ఐప్యాక్ సేవలే శరణ్యమా..?
TRS : టీఆర్ఎస్ యువమంత్రం జపిస్తోంది.. వచ్చే 2023 డిసెంబర్ నాటికి పెద్దఎత్తున కొత్త ఒటర్లతోపాటు యువతే గెలుపుఓటములను ప్రభావితం చేయనుంది..

TRS : టీఆర్ఎస్ యువమంత్రం జపిస్తోంది.. వచ్చే 2023 డిసెంబర్ నాటికి పెద్దఎత్తున కొత్త ఒటర్లతోపాటు యువతే గెలుపుఓటములను ప్రభావితం చేయనుంది.. ఇదే ఇప్పుడు టీఆర్ఎస్‌ను కలవరపాటుకు గురిచేస్తోంది. బీజేపీ వైపు ఆకర్శితులవుతున్న యువతను తమ వైపు తిప్పుకునేందుకు పీకే సహాకారం తప్పనిసరి అంటోంది.. ఐపాక్ టీం ఇన్‌‌‌పుట్స్‌తో నవతరం టీఆర్ఎస్ వైపు వస్తారా.. వచ్చే ఎన్నికల్లో గెలుపుతో హాట్రిక్ సాధించాలని తహతహాలాడుతున్న అధినేత కేసీఆర్ యువతను మెప్పిస్తారా.. నిరుద్యోగ యువత ఎక్కుగా ఉండే ఏజ్ గ్రూపు టీఆర్ఎస్‌‌కు సహకరించాలంటే.. ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉద్యోగాలభర్తీ పై నమ్మకం కలిగిస్తారా...రైతులు, పెన్శనర్లు సరే..యువతను ఆకర్శించాలంటే డిజిటల్ ప్లాట్ ఫామే శరణ్యమా... టీఆర్ఎస్ ఆందోళన ఎందుకు.. బీజేపీ సోషల్ మీడియాను తట్టుకోలేక ఐపాక్ సహాకారమా.

2014లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ .. కాళేశ్వరం ప్రాజెక్టు, ఆసరా పెన్షన్న్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ , కళ్యాణలక్ష్మి, షాదిముబారక్, నిరంతర విద్యుత్ ,24 గంటల ఉచితవిద్యుత్ పధకాల పై మెయిన్ ఫోకస్ పెట్టింది.. రైతుబంధు పదకం ప్రవేశపెట్టి .. పూర్తి కాలం కొనసాగకుండా.. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు సీఎం కేసీఆర్.. డబుల్ బెడ్ రూం, ఉద్యోగాల కల్పన, దళితుల భూపంపిణి వంటి హామీలు పూర్తిస్తాయిలో అమలు కాకపోవడంతో కొన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొన్నా....రైతుబంధు,ఉచిత విద్యుత్ , సంక్షేమపధకాల పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తోపాటు .. మోడీ హాహా మరోసారి తప్పదన్న సర్వేలతో పార్లమెంట్ ఎన్నికలతో కలిసి వెళ్లకుండా ... ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు సీఎం కేసీఆర్.

ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ప్రధాన కారణం... అప్పటి బీజేపీ ప్రభుత్వం,నరేంద్రమోడీ ఇమేజ్‌తో ఎన్నికలు ఎదుర్కోవడం సవాలని భావించిన సీఎం.. మోడీని ఒప్పించి మరీ ఎన్నికలకు వెళ్లారు.. అయితే తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుందామని ఆశపడ్డవారికి 2018 డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలు జరగడంతో నిరాశ చెందారు... 2019 జనవరి నాటికి దాదాపు పది లక్షల మంది యువత ఓటుహక్కు అర్హత సాధించేవారు.. మరో వైపు ఓట్ల గల్లంతుతో మరో పదిలక్షల మంది దాదాపు 20 లక్షల మంది ఓటర్లు 2018 ఎన్నికలకు దూరమయ్యారు.. ఆతర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుకున్నట్టుగానే ఫలితాలు వచ్చాయి.. ప్రతిపక్ష కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు ఏడు సీట్లు గెలుపొందాయి.. కేసీఆర్ కూతురు కవిత , కీలకనేత వినోద్ సైతం ఓటమి చెందారు... కేసీఆర్ నిర్ణయం సరైనదేనని అంతా భావించారు.. ముందస్తు వెళ్లడంతోనే కేసీఆర్ విజయం సాధించారనేది సుస్పష్టం..

ఇక ఆతర్వాత దుబ్బాకలో ఉపఎన్నిక అనివార్యమవడం.. రఘునందన్ రావు బీజేపీ తరుపున బరిలో దిగి గెలవడం టీఆర్ఎస్‌ను షాక్ కుగురిచేసింది.. అటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం బీజేపీ .. టీఆర్ఎస్ కు గట్టిపోటిని ఇచ్చింది.. అప్పటికే బీజేపీ అధ్యక్షునిగా ఎన్నికైన బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ సత్తా చాటింది.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సోషల్ మీడియా పవర్ తోనే బీజేపీ లబ్దిపోందింది.. టీఆర్ఎస్ సోషల్ మీడియా బీజేపీని దీటుగా ఎదుర్కొవడంలో విపలమైనందని పార్టీవర్గాలే చెప్పుకొచ్చాయి.. ఆతర్వాత ఈటేల రాజేందర్ టీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరడంతో మరోసారి సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది.. యూట్యాబ్ , ఫేస్ బుక్ , వాట్సాప్ లలో బీజేపీ సత్తా చాటింది.. ఫలితంగా ఈటెల భారీ మెజార్టీతో గెలుపొందారు... బీజేపీ చేసిన ప్రచారాలను తిప్పికొట్టడంలో సోషల్ మీడియాలో తమ పార్టీ వీక్ అని గుర్తించిన కేసీఆర్ ... పీకే సహయాన్ని ఆర్దించారు.

పలు దఫాలుగా ఆయనతో భేటి అయ్యారు.. రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావడం... అటు కేంద్రంలో కీలకపాత్ర పోషించేందుకు పీకే సహాయాన్ని కోరారు కేసీఆర్.... పీకే తన ఐపాక్‌ను రంగంలోకి దింపి... ఏ సెక్షన్లలో టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉంది.. యువత, తొలిసారి ఓటేసేందుకు సిద్దమవుతున్న వారిని ఎలా ఆకర్షించాలన్న దానిపై సర్వేలు చేసింది నివేదకలు అందించింది ఐపాక్ టీమ్.. దళితబంధు ప్రవేశపెట్టినా.... హుజూరాబాద్ ఎన్నికల్లో ఫలితం ఇవ్వలేదు.. నిరుద్యోగ యువత తీవ్ర ఆసంతృప్తితో ఉందని గుర్తించిన ఐపాక్ నివేదక మేరకు .. వెనువెంటనే .. 80 వేల ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు.. వారిలో భరోసా కల్పించేందుకు నోటిఫికేశన్లు సైతం వేసేందుకు అడుుగులువేస్తున్నారు..

తెలంగాణ సాధించిన నాటికి పదేళ్లున్న యువత 2023 డిసెంబర్ ఎన్నికల వరకు తొలి ఓటు వేయనున్నారు.. పద్దేనిమిదినుంచి 35 ఏళ్ల వయస్సున్న యువతే లక్ష్యంగా తమకు ఐపాక్ సేవలవసరమని అంటున్నారు వర్కింగ్ ప్రెసిడంట్ కేటీఆర్..పీకే కాంగ్రెస్‌లో చేరినా.... తమకు ఐపాక్ సేవలందుతాయని.. వారి ఇన్ పుట్స్ తో తమ నిర్ణయాల అమలు ఉంటుందని ప్రకటించారు.. రైతుబంధు, ఉచితవిద్యుత్ ,ఆసరా పెన్షన్లుకు తోడు ... అసంతృప్త సెక్షన్ల ను సైతం మెప్పిస్తే .. హ్యాట్రిక్ ఖాయమంటున్నారు .... సో చూడాలి నవతరం టీఆర్ఎస్‌కు జై కొడుతుందా.. ఐపాక్ సహాకారం లాభిస్తోందా...!


మార్గం శ్రీనివాస్

తెలంగాణ ఇన్ పుట్ ఎడిటర్

Tags

Read MoreRead Less
Next Story