2021 -22 బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుంది : సీఎం కేసీఆర్‌

2021 -22 బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుంది : సీఎం కేసీఆర్‌
2021 -22 బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. బడ్జెట్ ప్రతిపాదిత అంచనాలపై సీఎం కెసిఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

2021 -22 బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. బడ్జెట్ ప్రతిపాదిత అంచనాలపై సీఎం కెసిఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సంక్షేమ, అభివృద్ది పథకాల అమలును కొనసాగిస్తామని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా గొర్రెల పెంపకం పథకంపై ప్రత్యేకంగా చర్చించారు. ఇప్పటికే పంపిణీ చేసిన 3 లక్షల 70 వేల కొనసాగింపుగా మరో 3 లక్షల గొర్రెలు పంపిణికి బడ్జెట్‌లో ప్రతిపాదనలు పొందుపరచనున్నామని కేసీఆర్‌ తెలిపారు.

కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు 50 వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని... ఆ ప్రభావం లక్ష కోట్లకు చేరుకుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. కరోనాంతర పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని... వివిధ రూపాల్లో రాబడి పెరిగిందని చెప్పారు. గత బడ్జెట్ కంటే రానున్న బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగానే ఉంటాయని చెప్పారు.

బడ్జెట్ అంచనాలు, కేటాయింపుల విధి విధానాలు ఖరారయ్యాయని, రేపటి నుంచి ఆర్‌అండ్‌బీ, పంచాయితీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యా, ఇరిగేషన్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సమావేశాలు నిర్వహిస్తారని సీఎం తెలిపారు. అన్ని శాఖలతో బడ్జెట్ పై కసరత్తు ముగిసిన తర్వాత తుది దశలో కెసిఆర్ అధ్యక్షతన బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దనున్నారు. మార్చి నెల మధ్యలో బడ్జెట్‌ సమావేశాను ఉండనున్నాయని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story