తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ నివేదిక విడుదల

తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ నివేదిక విడుదల
7.5శాతం ఫిట్‌మెంట్‌ను బిశ్వాల్ కమిటీ సిఫార్సు చేసింది. మరోవైపు పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని కూడా రికమెండ్ చేసింది.

తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ నివేదిక విడుదలైంది. తొలుత ఉద్యోగ సంఘాలకే నివేదిక ఇవ్వాలని భావించినా.. ఆయా సంఘాల నేతల వినతితో 275 పేజీల నివేదికను వెబ్ సైట్ లో ప్రభుత్వం పెట్టింది. 7.5శాతం ఫిట్‌మెంట్‌ను బిశ్వాల్ కమిటీ సిఫార్సు చేసింది. మరోవైపు పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని కూడా రికమెండ్ చేసింది.

ఇటు నివేదికపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ నేటి నుంచి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. తొలిరోజు టీఎన్జీవో, టీజీవో సంఘాలకు త్రిసభ్యకమిటీ ఆహ్వానం పంపింది. సాయంత్రం ఐదు గంటల నుంచి హైదరాబాద్ లోని బీఆర్‌కే భవన్‌లో చర్చలు జరుగుతాయి. రెండు సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఈ చర్చల్లో పాల్గొంటారు. గురువారం నుంచి రెండు లేదా నాలుగు సంఘాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించనుంది. ఉద్యోగ సంఘాలతో చర్చలను పురస్కరించుకొని త్రిసభ్య కమిటీ విడిగా సమావేశం కానుంది.


Tags

Read MoreRead Less
Next Story