TSRTC: తెలంగాణలో ఆర్‌టీసీ ఛార్జీలు పెరిగే అవకాశం..

TSRTC (tv5news.in)

TSRTC (tv5news.in)

TSRTC: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంచేందుకు రంగం సిద్ధమైంది.

TSRTC: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంచేందుకు రంగం సిద్ధమైంది. ఛార్జీల పెంపుపై రివ్యూ చేశారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. ఛార్జీల పెంపుపై నెలక్రితమే సీఎంకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ఆర్డినరి సర్వీసుల్లో కిలోమీటర్‌కు 25 పైసలు, ఇతర సర్వీసుల్లో 30 పైసలు పెంచాలని ప్రతిపాదించారు.

రెండేళ్ల క్రితం ఛార్జీలు పెంచామన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కరోనా టైంలో నష్టం వచ్చినా కార్మికులను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నామన్నారు. కరోనా తర్వాత 561 సర్వీసులు పెంచామన్నారు. బడ్జెట్‌లో ఆర్టీసీకి 15 వందల కోట్లు సహాయం చేశామని గుర్తు చేశారు.

డీజిల్ ధరల పెంపు ఆర్టీసీకి భారంగా మారిందన్నారు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. ఆర్టీసీ రోజుకు 6 లక్షల 8 వేల లీటర్ల డీజిల్ వినియోగిస్తుందన్నారు. కేంద్ర విధానాల వల్లే ఛార్జీలు పెంచాల్సివస్తుందన్నారు. 16 వందల బస్సుల పరిస్థితి బాగాలేదన్నారు. రోజువారీగా 14 కోట్లు వస్తున్నా.. నష్టాలు పూడ్చలేకపోతున్నామని చెప్పారు.

గతంలో 20 పైసలు పెంచినా..పెద్ద ప్రయోజనం కలగలేదన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఫస్ట్ వేవ్‌, సెకండ్‌ వేవ్ టైంలో ఆర్టీసీపై చాలా భారం పడిందన్నారు. డీజిల్ ధరలు 27 శాతానికిపైగా పెరిగాయన్నారు. డీజిల్‌తో 468 కోట్ల నష్టం వచ్చిందన్నారు. కొత్త సర్వీసులు పెంచుతున్నామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story