సీఎం కేసీఆర్‌తో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భేటీ..!

సీఎం కేసీఆర్‌తో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భేటీ..!
ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమావేశమయ్యారు. మధ్యాహ్న భోజనానికి సీఎం కేసీఆర్‌ ఆహ్వానించడంతో ఆయన వెళ్లారు.

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమావేశమయ్యారు. మధ్యాహ్న భోజనానికి సీఎం కేసీఆర్‌ ఆహ్వానించడంతో ఆయన వెళ్లారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ జరపాలని.... ఇతర దేశాలకు డైరెక్ట్‌ కనెక్టివిటీని పెంచాలని సీఎం కేసీఆర్‌ కోరారు. అలాగే రాష్ట్రంలో 6 ఎయిర్‌ పోర్టుల అభివృద్ధికి సహకరించాలన్నారు. అదే విధంగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మెట్రో కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని కోరారు సీఎం కేసీఆర్‌. దీనిపై సానుకులంగా స్పందించారు కేంద్ర మంత్రి సింధియా. అన్ని విషయాలను తమ మంత్రిత్వ శాఖ ద్వారా పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మీడియాతో మాట్లాడారు. విమానాయాన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని... ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలోనే హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టు విస్తరణ చేపడతామన్నారు. డిజిటల్‌ ఎయిర్‌ స్పేస్‌ మ్యాప్‌ ద్వారా అనుమతులు సులభతరమవుతాయన్నారు. వరంగల్‌, ఆదిలాబాద్‌లో బ్రౌన్‌ ఫీల్డ్‌ విమానాశ్రాల ఏర్పాటు కేంద్రం సుముఖంగా ఉందని తెలిపారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.

ఇక టీఆర్‌ఎస్‌, బీజేపీ సంబంధాలపై కేంద్ర మంత్రి స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాలే.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ విజన్‌ను అమలు చేయడమే కేంద్ర మంత్రుల బాధ్యత అన్నారు. టీఆర్‌ఎస్‌తో బీజేపీ రాజకీయ పోరాటం కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యమన్నారు. తెలంగాణ ప్రజలు చూపిస్తున్న విశ్వాసం, ప్రేమతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారిందన్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.

Tags

Read MoreRead Less
Next Story