రైతులను ఆదుకునేందుకే కొత్త చట్టాలు తెచ్చాము : మంత్రి కిషన్ రెడ్డి

రైతులను ఆదుకునేందుకే కొత్త చట్టాలు తెచ్చాము : మంత్రి కిషన్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఏర్పాటు చేసిన రైతు సదస్సులో మంత్రి పాల్గొన్నారు. వ్యవసాయంలో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకే కొత్త చట్టాలు తెచ్చామన్నారు.

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఏర్పాటు చేసిన రైతు సదస్సులో మంత్రి పాల్గొన్నారు. వ్యవసాయంలో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకే కొత్త చట్టాలు తెచ్చామన్నారు. వీటివల్ల రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్చ కల్పించనట్లైందన్నారు.

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రం సహాయం చేస్తుందని, ఆ పథకాలపై ఎక్కడా ప్రధాని మోదీ బొమ్మపెట్టకుండా తండ్రికొడుకుల ఫోటోలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. వెనుకబడిన జిల్లాకు 150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపడితే తన వాటాకింద రాష్ట్రప్రభుత్వం ఇంతవరకు ఒక్క రూపాయి విడుదల చేయలేదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story