నాగార్జునసాగర్‌లో 50వేల మెజార్టీతో గెలవబోతున్నాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

నాగార్జునసాగర్‌లో 50వేల మెజార్టీతో గెలవబోతున్నాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి
నాగార్జున సాగర్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్.. ప్రచార జోరును మరింత పెంచింది. నల్గొండ జిల్లా హాలియాలో జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది.

నాగార్జున సాగర్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్.. ప్రచార జోరును మరింత పెంచింది. నల్గొండ జిల్లా హాలియాలో జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు ఉత్తమ్, భట్టి, షబ్బీర్ అలీతో సహా సీనియర్ నేతలు హాజరయ్యారు. నాగార్జున సాగర్‌కు తాను ఏం చేశానో చెప్పాలంటూ అడిగే హక్కు టీఆర్ఎస్ నేతలకు లేదన్నారు జానారెడ్డి. కేసీఆర్‌ వస్తే తాను ఏం చేశానో చూపిస్తానన్నారు. నల్గొండ జిల్లాకు సాగర్ ద్వారా నీళ్లు తీసుకొచ్చింది కాంగ్రెసే అన్నారు జానారెడ్డి.

మరోవైపు నాగార్జున సాగర్‌లో 50వేల మెజార్టీతో గెలవబోతున్నామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సాగర్‌లో బీజేపీ డిపాజిట్ కోల్పోతుందని.. జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరుగుతాయన్నారు . 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో తమ పార్టీ తరపున ప్రచారం నిర్వహించడానికి వీలుగా నియోజకవర్గంలోని వివిధ మండలాలకు ఇన్‌చార్జిలను నియమించింది బీజేపీ . నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డిలను నియమించింది. అయితే ఇప్పటి వరకు అభ్యర్థిని ఫైనల్ చేయలేదు కమలనాథులు. టికెట్‌ను ఆశిస్తున్నవారి సంఖ్య భారీగా ఉండటంతో బుజ్జగింపు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించే వరకు వేచి చూడాలని బీజేపీ భావిస్తోంది.

అటు టీఆర్ఎస్‌ కూడా తమ అభ్యర్థి ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దాదాపు నోముల నర్సింయ్య కుమారుడికే టికెట్ ఖరారయ్యే ఛాన్స్ ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు..నామినేషన్ల గడువు దగ్గర పడుతుండటంతో ఇవాళో రేపో, అభ్యర్థిని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది..

Tags

Read MoreRead Less
Next Story