తెలంగాణలో దళితులు, గిరిజనులు, మహిళలకు అన్యాయం : ఉత్తమ్‌

తెలంగాణలో దళితులు, గిరిజనులు, మహిళలకు అన్యాయం : ఉత్తమ్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. దేశంలో మహిళలు, దళితులపై రోజు రోజుకు అత్యాచారాలు, దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయని హైదరాబాద్‌లో నిర్వహించిన మహాధర్నాలో మండిపడ్డారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హథ్రస్‌లో జరిగిన ఘటన అమానవీయమని అన్నారు. తెలంగాణలో దళితులు, గిరిజనులు, మహిళలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. మంత్రివర్గంలోనూ సామాజిక న్యాయం పాటించలేదని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ దళిత వ్యతిరేక చర్యలను ప్రతిఘటించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.


Tags

Read MoreRead Less
Next Story