Vanama Raghavendra Rao: వనమా రాఘవేంద్రపై టీఆర్‌ఎస్‌ చర్యలు.. సస్పెన్షన్ వేటు..

Vanama Raghavendra Rao: వనమా రాఘవేంద్రపై టీఆర్‌ఎస్‌ చర్యలు.. సస్పెన్షన్ వేటు..
Vanama Raghavendra Rao: పాల్వంచ రామకృష్ణ సుసైడ్‌ కేసులో వనమా రాఘవేంద్రపై టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం చర్యలు తీసుకుంది.

Vanama Raghavendra Rao: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాల్వంచ రామకృష్ణ సుసైడ్‌ కేసులో వనమా రాఘవేంద్రపై టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం చర్యలు తీసుకుంది.. టీఆర్‌ఎస్‌ నుంచి వనమా రాఘవను సప్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదేశాలతో పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఖమ్మం వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ నూకల నరేష్‌ రెడ్డి పేరిట చర్యలకు సంబంధించిన ప్రకటన విడుదల చేశారు.. సస్పెన్షన్‌ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని పార్టీ అధిష్టానం తెలిపింది..

అటు పరారీలో ఉన్న వనమా రాఘవ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా అతని ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. 2001లో కూడా వనమా రాఘవ ఇదే తరహా కేసులో ఉన్నారు. అప్పుడు కూడా ఆర్థిక వ్యవహారంలో ఓ ఫైనాన్షియర్‌ ఆత్మహత్యకు పాల్పడటంతో.. ఆ కేసులో బెయిల్‌పై తిరుగుతున్నాడు. తాజాగా పోలీసులు ఇచ్చిన నోటీస్‌లో ఈ కేసును ప్రస్తావించారు. వెంటనే మణుగూరు పోలీసుల ముందు లొంగిపోవాలని.. లేదంటే 2001లో కేసుకు సంబంధించి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేస్తామని నోటీస్‌లో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story