హైదరాబాద్‌లో విరబూసిన అరుదైన పుష్పం..ఏడాదికి ఒకసారి మాత్రమే..!

హైదరాబాద్‌లో విరబూసిన అరుదైన పుష్పం..ఏడాదికి ఒకసారి మాత్రమే..!
Very rare flower: హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌ లో ఓ ఇంట్లో అత్యంత అరుదైన పుష్పం విరబూసింది.

BrahmaKamal: అత్యంత అరుదైన బ్రహ్మకమలం విరబూసింది. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌ లో ఓ ఇంట్లో విరపూసింది. ఏడాదికి ఒకసారిమాత్రమే పూసి..కొన్నిగంటలు మాత్రమే ఉండే ఈ అరుదైన పుష్పం...రాత్రి 11గంటల సమయంలో 3గంటల పాటు కనువిందు చేసింది. బ్రహ్మకమలం పుష్ఫించిన సమయంలో దాని చుట్టుపక్కల ప్రాంతాలకు సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి. ఈ అరుదైన పుష్పాన్ని స్థానికులు ఎంతో ఆసక్తిగా తిలకించారు.

ఈ బ్రహ్మకమలం పుష్పం ఎంతో ప్రత్యేకమైంది. హిందూ సంప్రదాయంలో దీనికి చాలా విశిష్టత ఉంది. బ్రహ్మ కమలం అంటే బ్రహ్మదేవుడు కూర్చునే పువ్వు అనే అర్థం.బ్రహ్మ కమలం అంటే శ్రీ మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించినదిగా పురాణాల్లో ఉంది. దీని నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడని పెద్దలు చెబుతారు.

ఇది హిమాలయాల్లో దొరికే చాలా అరుదైన మొక్క.. ఈ మొక్కను ఇంట్లో ఉంచితే మంచిదని హిందువులు భావిస్తారు. కొన్ని గంటలు మాత్రమే వికసించే ఈ అందమైన పుష్పాన్ని చూసేందుకు జనాలు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ పుష్పం మన జనారణ్యంలో చాలా తక్కువగా కనిపిస్తుంది. దీన్ని పెంచేవాళ్లు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. ఈ పుష్పం ఏడాదికి ఒకసారి మాత్రమే విరబూస్తుంది. అందుకే దీన్ని ఎంతో ఆరుదుగా చూస్తారు.

Tags

Read MoreRead Less
Next Story