Saroor Nagar Murder: నాగరాజును చంపింది ఐదుగురు అంటున్న భార్య.. కానీ ఇద్దరినే అరెస్ట్..

Saroor Nagar Murder: నాగరాజును చంపింది ఐదుగురు అంటున్న భార్య.. కానీ ఇద్దరినే అరెస్ట్..
Saroor Nagar Murder: సరూర్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లిచేసుకున్న యువకుడు నాగరాజు దారుణ హత్యకు గురయ్యాడు.

Saroor Nagar Murder: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లిచేసుకున్న యువకుడు నాగరాజు దారుణ హత్యకు గురయ్యాడు. యువతి బంధులే దాడిచేశారని స్థానికులు, నాగరాజు కుటుంబీకులు చెబుతున్నారు. అయితే తన కొడుకు నాగరాజుకు ప్రాణ హాని ఉందని సుల్తానానే స్వయంగా చెప్పిందని..తన బిడ్డను ఇంత దారుణంగా చంపేస్తారని అనుకోలేదని మృతుడి తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

ఈ ఘటనతో నాగరాజు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉన్న ఒక్కగాను ఒక్క కొడుకు హత్యకు గురికావడంతో మృతుడి తల్లిదండ్రులు, కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన అన్నను అత్యంత దారుణంగా హత్యచేసినవారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని నాగరాజు సోదరి డిమాండ్ చేస్తుంది. లేదంటే నిరసనకు దిగుతామని హెచ్చరిస్తోంది.

సరూర్‌నగర్‌ పరువు హత్య కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు పోలీసులు. తన భర్తపై ఐదుగురు దాడి చేశారని సుల్తానా చెబుతున్నప్పటికీ.. హత్య చేయడానికి వచ్చింది ఇద్దరు మాత్రమేనని ఎల్బీనగర్ ఏసీపీ అంటున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించి నిందితులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. అయితే ఈ హత్య వెనక ఎవరి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టమని తెలిపారు.

నాగరాజు తన భార్య సుల్తానాతోకలిసి బైక్‌మీద వెళుతుండగా అడ్డగించి అత్యంత దారుణంగా హత్యచేయడాన్ని తీవ్రంగా ఖండించారు బీజేపీ దళిత మోర్చా నేతలు. నాగరాజు కుటుంబానికి న్యాయం చేయాలంటూ వారు రోడ్డుపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారుడిమాండ్ చేశారు. హోంమంత్రి అసమర్ధత తోనే రాష్ట్రంలో ఇలాంటి హత్యలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆరోపించారు.

సరూర్‌ నగర్‌కు చెందిన నాగరాజు ఓ కార్లషోరూమ్‌లో సేల్స్‌ మేన్‌గా పనిచేస్తున్నాడు. అతను సయ్యద్ ఆశ్రిన్‌ సుల్తానా అనే యువతిని ప్రేమించి ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరి ఇష్టప్రకారమేపెళ్లి చేసుకోగా.. సుల్తానా కుటుంబ సభ్యులు వివాహానికి అడ్డుచెప్పారు. దీంతో తనకు రక్షణ కావాలంటూ నాగరాజు పోలీసులను ఆశ్రయించారు.

అయితే ఈ నేపథ్యంలో నిన్న రాత్రి 9 గంటల సమయంలో నాగరాజు, సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా బైక్‌ వెళ్తుండగా... సరూర్‌నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర్లో వీరిని అడ్డగించి దుండగులు నాగరాజు పై ఇనుపరాడ్‌తో దాడి చేసి కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన నాగరాజు...భార్య సుల్తానా కళ్లముందే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Tags

Read MoreRead Less
Next Story