మారుమూల పల్లె ప్రాంతాల్లో ఉచిత వాక్సినేషన్ డ్రైవ్ చేస్తున్న యశోద ఫౌండేషన్

మారుమూల పల్లె ప్రాంతాల్లో ఉచిత వాక్సినేషన్ డ్రైవ్ చేస్తున్న యశోద ఫౌండేషన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం తెలంగాణా రాష్ట్రంలో మారుమూల పల్లెలు అధికంగా కలిగిన ప్రాంతం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం తెలంగాణా రాష్ట్రంలో మారుమూల పల్లెలు అధికంగా కలిగిన ప్రాంతం. మారుమూల ప్రాంతాల్లో కూడా కోవిడ్ మహమ్మారి విజృంభించిన వేళ పజ్రలు అందరూ సకాలంలో వాక్సినేషన్ చేసుకోవడం యొక్క ప్రాధాన్యత గురించి అవగాహన కల్పిస్తూ మరియు వారిలో గల అపోహలను తొలగించడానికి యశోద ఫౌండేషన్ వారు కృషిచేస్తున్నారు. మారుమూల ప్రాంత పజ్రల సమస్యలపై పనిచేసే సామాజిక కార్యకర్తల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు యశోద ఫౌండేషన్ వారు తేదీ19 సెప్టెంబర్ 2021, ఆదివారం నాడు ఇల్లందు మండలంలోని కొన్ని గ్రామాల్లో ఉచిత వాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు.

ఈ డ్రైవ్ లో భాగంగా చల్లసముద్రం, ఒడ్డుగూడెం, రేపల్లెవాడ,ధనియాలపాడు, లచ్చగూడెం మరియు పరిసర గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండిన పజ్రలకు యశోద హాస్పిటల్ కిచెందిన అనుభవజ్ఞులైన సిబ్బంది వ్యా క్సిన్ ఇచ్చారు. పూర్తి పభ్రుత్వ కోవిడ్ మార్గదర్శకాలతో మరియు సామాజిక దూరం పాటిస్తూ అర్హులైన ఈ గ్రామాలకి చెందిన వారికి ఆదివారం ఒక్క రోజులోనే 500 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగింది. యశోద ఫౌండేషన్ వారిCSR సేవలో భాగంగా రవాణా మరియు సరియైన రహదారిమార్గం లేని మారుమూల ప్రాంత పజ్రలకి కూడా అభివృద్ధి చెందిన పట్టణ ప్రాంత పజ్రలు పొందుతున్న కరోనా వాక్సిన్ సదుపాయం అందించడానికి ముందుకు వచ్చింది.

కరోనా మహమ్మారిని ఎదుర్కో వడంలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న "కరోనా వ్యా క్సిన్" గురించి డాక్టర్ అభినవ్ మాట్లాడుతూ, "తెలంగాణ రాష్ట్రంలో మారుమూల గ్రామాల పజ్రలకి వాక్సిన్ ఇప్పించడంలో యశోద ఫౌండేషన్ వారిని భాగస్వా ములు చేసిన మరియు వాక్సినేషన్ డ్రైవ్ ని విజయవంతం చేయడం లో సహకరించిన సామాజిక కార్యకర్తలు, పభ్రుత్వ యంత్రాంగం మరియు నాయకులకు ధన్యవాదాలు" తెలియజేశారు.

Tags

Read MoreRead Less
Next Story