ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్యాయత్నం..!

ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్యాయత్నం..!
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రామ్‌సింగ్ తండాకు చెందిన బోడ సునీల్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

వరంగల్ జిల్లాలోఉద్యోగం రావడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రామ్‌సింగ్ తండాకు చెందిన బోడ సునీల్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తెలంగాణ వచ్చి ఏడేళ్లు అయినా తనకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేస్తూ పురుగుల మంది తాగాడు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడున్న స్థానికులు హుటాహుటినా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story