"30 రోజుల్లో ప్రేమించడం ఎలా".. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

బుల్లితెర పై తనదైన యాంకరింగ్ తో ఆకట్టుకున్న ప్రదీప్ మాచిరాజు మొదటిసారి హీరోగా నటించిన తొలిచిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా’..

30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
X

బుల్లితెర పై తనదైన యాంకరింగ్ తో ఆకట్టుకున్న ప్రదీప్ మాచిరాజు మొదటిసారి హీరోగా నటించిన తొలిచిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'.. ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృతా నాయర్ హీరోయిన్ గా నటించింది. మున్నా దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. తొలిరోజే ఈ సినిమాకి ఏకంగా రూ.4 కోట్ల గ్రాస్‌ వచ్చింది. దీనితో ప్రదీప్ తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. "ఎన్నో రోజుల కల ఇది. మీ అందరి సహకారంతోనే ఈ రోజు సాధ్యం అయింది. అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా ధన్యవాదాలు.. ఎప్పటికి ఇలాగే మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉంటాను" అని ప్రదీప్ పేర్కొన్నాడు.

Next Story

RELATED STORIES