Anasuya Bharadwaj :ఆ పాత్రలు చేయడానికి కూడా రెడీ.. కానీ కండిషన్స్ అప్లై..!

Anasuya Bharadwaj :ఆ పాత్రలు చేయడానికి కూడా రెడీ..  కానీ కండిషన్స్ అప్లై..!
Anasuya Bharadwaj : బుల్లితెరకి గ్లామర్ అద్దిన అతికొద్దిమంది యాంకర్ లలో అనసూయ ఒకరు.. జబర్దస్త్ షోతో ఫుల్ పాపులర్ అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత వెండితెర పైన కూడా అదరగొడుతోంది.

Anasuya Bharadwaj :బుల్లితెరకి గ్లామర్ అద్దిన అతికొద్దిమంది యాంకర్ లలో అనసూయ ఒకరు.. జబర్దస్త్ షోతో ఫుల్ పాపులర్ అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత వెండితెర పైన కూడా అదరగొడుతోంది. సోగ్గాడే చిన్నినాయన, క్షణం, రంగస్థలం సినిమాలలో నటించి నటిగా తనేంటో ప్రూవ్ చేసుకుంది.

ఇందులో రంగస్థలం సినిమాలోని ఆమె చేసిన రంగమ్మత్త పాత్ర ఆమెకి మంచి పేరును తీసుకొచ్చింది. ఆ తర్వాత చాలానే అవకాశాలు వచ్చినప్పటికీ పాత్రలు బాగుంటేనే సినిమాలని చేసుకుంటూ వెళ్తోంది అందాల అనసూయ.. ఇదిలా ఉంటే సినిమాలలో ఇవే పాత్రలు చేయాలనీ తనేం కమిట్ అవ్వలేదని, మంచి పాత్రలు వస్తే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమనే అంటోది ఈ బుల్లితెర బ్యూటీ.

చివరికి హీరోహీరోయిన్ లకి అమ్మ పాత్రలు చేయడానికి కూడా రెడీనే అంటుంది. అయితే కండిషన్ అప్లై అంటుంది. అదేంటంటే.. అలాంటి పాత్రలు చేసినప్పడు బయటకు వచ్చాక ప్రేక్షకులు ఆ పాత్ర గురించి మాట్లాడుకోవాలని ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది అనసూయ.

కాగా ప్రస్తుతం ఈ రంగమ్మత్త... కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రంగమార్తాండ" సినిమాలో ఓ కీరోల్ పోషిస్తోంది. అంతేకాకుండా సుకుమార్ "పుష్ప"లో కూడా నటిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story