Balakrishhna : ఒప్పుకోవాల్సిందే.. దటీజ్ బాలయ్య... !

Balakrishhna : ఒప్పుకోవాల్సిందే..  దటీజ్ బాలయ్య... !
Balakrishna : బాలకృష్ణ.. ఎలాంటి పాత్రలోనైనా సరే అందులో పరకాయప్రవేశం చేసి ప్రేక్షకులను మెప్పించగలడు. దర్శకుడు చెప్పిన కథకి ఒక్కసారి ఓకే చెబితే సినిమా మొత్తం సరెండర్ అయిపోతాడు.

Balakrishna : బాలకృష్ణ.. ఎలాంటి పాత్రలోనైనా సరే అందులో పరకాయప్రవేశం చేసి ప్రేక్షకులను మెప్పించగలడు. దర్శకుడు చెప్పిన కథకి ఒక్కసారి ఓకే చెబితే సినిమా మొత్తం కమిట్మెంట్ అయిపోతాడు. ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రల్లో నటించేందుకు బాలయ్య ఎక్కువగా ఇష్టపడుతుంటారు. బైరవద్వీపం, ఆదిత్య 369 లాంటి ప్రయోగాత్మక చిత్రాలు ఆయన నుంచి వచ్చాయి. ఇప్పుడు అఖండలో అఘోర పాత్ర. టాలీవుడ్ లో చాలా మంది హీరోలు చాలా రకాల పాత్రలు పోషించారు. కానీ అఘోర పాత్రను మాత్రం ఎవ్వరు చేయలేదు.

కానీ ఆ సాహసం చేశారు బాలయ్య.. సాహసం చేయడమే కాదు.. ఆ సాహసం చేసి ప్రేక్షకుల చేత విజిల్ కొట్టించారు. చప్పట్లు కొట్టించారు. ఇలాంటి పాత్రలు చేయాలంటే బాలయ్యే చేయాలి అనేంతలా ఆ పాత్రలో ఒదిగిపోయారు. పాత్ర కోసం బాగానే కష్టపడ్డారు బాలయ్య. దర్శకుడు బోయపాటి చెప్పిన పాత్రను ఓన్ చేసుకొని డెడికేషన్ తో ఆ పాత్రలో జీవించారు బాలయ్య. ఇప్పుడు అదే పాత్ర సినిమాని హిట్ మెట్టు ఎక్కించి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది.

ఇదే కాదు బైరవద్వీపం సినిమాలో ఒక కురూపి పాత్రలో కనిపించి అందరినీ షాక్ కి గురి చేశారు బాలయ్య.. అసలే అందగాడు... పైగా స్టార్ హీరో... అలాంటి హీరోని ఓ కురూపి పాత్రలో చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడరు.. కానీ నటుడంటే అన్ని రకాల పాత్రలు పోషించాలి కాబట్టి ఆ పాత్రను సీరియస్ గా తీసుకొని చేశారు బాలయ్య.. ఆ పాత్రలో కనిపించింది బాలయ్యేనా అనేట్టుగా నటించారాయన. ఇప్పుడు అఖండలో కూడా అఘోరాగా కనిపించి మరోసారి తనకి తానే సాటి అనిపించుకున్నారు. దటీజ్ బాలయ్య.

Tags

Read MoreRead Less
Next Story