RGV: డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులు.. వర్మపై ఛీటింగ్ కేసు..

RGV: డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులు.. వర్మపై ఛీటింగ్ కేసు..
RGV: ఆశ ఎన్‌కౌంటర్ సినిమాను తెరకెక్కించే సమయంలో శేఖర్‌ రాజు అనే వ్యక్తి దగ్గర ఆర్జీవీ రూ.56 లక్షలు తీసుకున్నాడు.

RGV: తాను చేసే పనుల వల్ల ఎన్ని కాంట్రవర్సీలను ఎదుర్కోవాల్సి వచ్చినా.. తన వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోను అంటుంటాడు వర్మ. దాని వల్లే తను పలు సమస్యల్లో కూడా చిక్కుకున్నాడు. అయినా వర్మ స్టైలే సెపరేటు.. ఎవ్వరికీ భయపడడు.. నచ్చింది మాట్లాడతాడు.. నచ్చినట్టు ఉంటాడు. అయితే అలాంటి వర్మపై ఓ వ్యక్తి ఛీటింగ్ కేసు పెట్టడం సంచలనంగా మారింది.

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించే సినిమాలన్నీ కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. గత కొంతకాలంగా నిజంగా జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా చిత్రాలను తెరకెక్కించడం మొదలుపెట్టాడు వర్మ. అందులో ఒకటి 'ఆశ ఎన్‌కౌంటర్'. హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్‌ గ్యాంగ్ రేప్ నిందితుల ఎన్‌కౌంటర్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పుడు ఈ సినిమా వల్ల ఆర్జీవీ చిక్కుల్లో పడ్డాడు.

ఆశ ఎన్‌కౌంటర్ సినిమాను తెరకెక్కించే సమయంలో శేఖర్‌ రాజు అనే వ్యక్తి దగ్గర ఆర్జీవీ రూ.56 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే.. తిరిగి ఇవ్వకపోగా.. శేఖర్‌ రాజుపై బెదిరింపులకు పాల్పడ్డాడట ఆర్జీవీ. దీంతో శేఖర్‌ రాజు పోలీసులను ఆశ్రయించాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్‌‌లో వర్మపై కేసు నమోదయ్యింది.

Tags

Read MoreRead Less
Next Story