NTR 30: కొరటాల, ఎన్‌టీఆర్ మూవీ.. తెరపైకి మరో బాలీవుడ్ భామ పేరు..

NTR 30: కొరటాల, ఎన్‌టీఆర్ మూవీ.. తెరపైకి మరో బాలీవుడ్ భామ పేరు..
NTR 30: ఎన్‌టీఆర్ 30లో ఓ బాలీవుడ్ భామనే హీరోయిన్‌గా తీసుకోవాలని కొరటాల శివ ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తోంది.

NTR 30: హీరోలందరూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. గ్యాప్ లేకుండా ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అందులో ఒకరు ఎన్‌టీఆర్. ఇటీవల తారక్ పుట్టినరోజు సందర్భంగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌తో సినిమాలను కన్ఫర్మ్ చేస్తూ అప్డేట్స్ ఇచ్చాడు. అయితే త్వరలోనే కొరటాలతో సినిమా సెట్స్‌లో అడుగుపెడుతుండడంతో ఈ సినిమాలో ఎన్‌టీఆర్‌కు జోడీగా ఎవరు నటిస్తారు అనేది హాట్ టాపిక్‌గా మారింది.

ఆర్ఆర్ఆర్ సినిమాతో అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు ఎన్‌టీఆర్. ఇందులో ఎన్‌టీఆర్ యాక్టింగ్‌లో మరో మెట్టు ఎక్కాడని ప్రేక్షకులంతా ప్రశంసించారు. దీంతో తన తరువాతి సినిమాలపై అందరిలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ప్రేక్షకుల అంచనాలు అందుకోవడానికి కొరటాల శివ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ముందుగా ఎన్‌టీఆర్ 30కి క్యాస్టింగ్ విషయంలో ఈ దర్శకుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఎన్‌టీఆర్ 30 సినిమాలో ఎట్టి పరిస్థితుల్లో ఓ బాలీవుడ్ భామనే హీరోయిన్‌గా తీసుకోవాలని కొరటాల శివ ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తోంది. అందుకే ముందుగా ఇందులో ఆలియా భట్‌ను తీసుకున్నా.. ఇది పాన్ ఇండియా చిత్రం కాకపోవడంతో ఆలియా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆ తర్వాత జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా వార్తలు వచ్చినా.. అది కూడా నిజం కాదని తేలిపోయింది. ప్రస్తుతం ఈ సినిమాలో ఎన్‌టీఆర్‌కు జోడీగా దిశా పటానీ ఫైనల్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. మరి చాలాకాలం నుండి టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న దిశా.. ఈ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.



Tags

Read MoreRead Less
Next Story