Konda Surekha - Murali Love story : బుల్లెట్టు బండి పై వచ్చి ప్రపోజ్.. హీరోలా పెళ్లి.. కొండా సురేఖ లవ్ స్టోరీ..!

Konda Surekha - Murali Love story : బుల్లెట్టు బండి పై వచ్చి ప్రపోజ్.. హీరోలా పెళ్లి.. కొండా సురేఖ లవ్ స్టోరీ..!
Konda Surekha - Murali Love story : నేను చదువుకున్నప్పుడు నన్ను చూసేందుకు ఏడు గంటలకే లేచి వచ్చి రౌండ్స్ వేసేవాడు.. కాలేజీకి బస్‌‌లో వెళ్తే.. బస్సు వెనకాలే వచ్చేవాడు..

Konda Surekha - Murali Love story : వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరో సెన్సేషనల్‌ బయోపిక్‌తో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి తెలంగాణ రాజకీయాల్లో కొండా దంపతులు కొండా మురళి, కొండా సురేఖల జీవిత చరిత్రతో "కొండా" అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం వర్మ వరంగల్‌కు విచ్చేసారు. వంచనగిరిలో కొండా సినిమా ప్రారంభోత్సవం చేసిన ఆర్జీవీ.. అక్కడే షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మురళితో ఉన్న తన లవ్ స్టొరీని సురేఖ వెల్లడించారు.

" నేను చదువుకున్నప్పుడు నన్ను చూసేందుకు ఏడు గంటలకే లేచి వచ్చి రౌండ్స్ వేసేవాడు.. కాలేజీకి బస్‌‌లో వెళ్తే.. బస్సు వెనకాలే వచ్చేవాడు.. ఓ రోజు బస్‌‌స్టాప్‌‌లో నిల్చొని ఉన్నప్పుడు బైక్ పైన వచ్చి నా ముందు ఆపి నా ఫోన్ నెంబర్ రాసుకొమ్మని చెప్పాడు.. నేను కూడా రాసుకున్నాను.. చాలా రోజుల తర్వాత ఓ రోజు ఫోన్ చేయాలనీ అనిపించి ఫోన్ చేస్తే ఆయన కాకుండా మరొకరు ఫోన్ లిఫ్ట్ చేశారు. మరోసారి ఫోన్ చేస్తే కలవలేదు.. ఓ రోజు నేను షేటిల్ ఆడుతున్న టైంలో బుల్లెట్టు బండి పైన వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని డైరెక్ట్‌‌గా ప్రపోజ్ చేశాడు.

అప్పుడు మా కులం ఏంటో తెలుసా అంటే.. తెలుసని ఇంట్లో కూడా ఒప్పిస్తానని అన్నాడు. ఇదే విషయాన్ని మా ఇంట్లో చెప్పాడు. అయితే అప్పటికే నాకు ఓ అక్క పెళ్లికి ఉండడంతో ఆమె పెళ్లి అయ్యాక చేస్తామని మా తల్లిదండ్రులు అన్నారు. అప్పుడు అనుకోని పరిస్థితిల్లో మురళి వాళ్ళ అన్నయ్య చనిపోవడం, ఆయనకీ ఓ కొడుకు ఉండడంతో తొందరగానే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మా ఇంట్లో అందరు ఉండగానే సాయింత్రం ఏడు గంటల సమయంలో ఓ హీరో లాగా వచ్చి నన్ను తీసుకెళ్ళి తిరుపతిలో వివాహం చేసుకున్నాడు" అని చెప్పుకొచ్చారు సురేఖ. ఆయన వ్యక్తిత్వం, మంచితనం వల్లే నేను ఇంతలా రాణించని అన్నారు సురేఖ.

Tags

Read MoreRead Less
Next Story