Manchu Vishnu : 'మా' అధ్యక్షడిగా మంచు విష్ణు తొలి నిర్ణయం..!

Manchu Vishnu : మా అధ్యక్షడిగా మంచు విష్ణు తొలి నిర్ణయం..!
Manchu Vishnu : ఇటీవల మా అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా తన తొలినిర్ణయాన్ని వెల్లడించాడు

Manchu Vishnu : ఇటీవల మా అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా తన తొలినిర్ణయాన్ని వెల్లడించాడు. మాలో మహిళల భద్రత, సాధికారతను పెంపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించాడు. ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్‌ దీనికి గౌరవ సలహాదారుగా ఉంటారని తెలిపారు. ఇక ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉంటారని దీనికి సభ్యులను త్వరలోనే వెల్లడిస్తానని విష్ణు ట్వీట్ చేశాడు. కాగా తాజాగా ఈ నెలలో జరిగిన మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పైన మంచు విష్ణు గెలిచిన సంగతి తెలిసిందే.




Tags

Read MoreRead Less
Next Story