Nagababu : 'ఈ సమాజం నన్ను యాక్సెప్ట్‌ చేస్తుందా మావా'...!

Nagababu : ఈ సమాజం నన్ను యాక్సెప్ట్‌ చేస్తుందా మావా...!
Nagababu : సోషల్ మీడియాలో మెగా బ్రదర్ నాగబాబు ఎంత యాక్టివ్‌‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగిన ప్రశ్నలను సమాధానాలు ఇస్తుంటరాయన...

Nagababu : సోషల్ మీడియాలో మెగా బ్రదర్ నాగబాబు ఎంత యాక్టివ్‌‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగిన ప్రశ్నలను సమాధానాలు ఇస్తుంటరాయన... అందులో భాగంగా తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్‌ మీ ఎనీథింగ్‌ సెషన్‌ను నిర్వహించారు. ఇందులో ఆయనని ఓ నెటిజన్.. "బిగ్‌బాస్‌ లేదా ఐపీఎల్"...ఈ రెండింట్లో ఏది ఫాలో అవుతారంటూ అని ప్రశ్నించాడు.


దీనిపైన నాగబాబు స్పందిస్తూ.. 'బిగ్‌బాస్‌ చూడకుండా ఐపీఎల్‌ చూస్తూ ... నా బిడ్డ లాంటి ప్రియాంక సింగ్‌కి సపోర్ట్‌ చేస్తే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్‌ చేస్తుందా మావా' అంటూ ఫన్నీగా బ్రహ్మానందం ఫోటో పెట్టి ఆన్సర్ ఇచ్చారు నాగబాబు.. అయితే నాగబాబు చేసిన ఈ ట్వీట్ పైన ప్రియాంక టీం స్పందించింది. 'మీరు ఎప్పుడు ఎవరిని ఊరికే సపోర్ట్ చేయరు. జెన్యూన్ అయితే తప్పా.. ఆ జెన్యూన్ నేచర్ మన పింకీని ఇంత వరకూ తీస్కోచ్చింది.. మీలాగే అందరూ సపోర్ట్ చేసేలా చేస్తోంది' అంటూ పోస్ట్ చేసింది.


కాగా బిగ్ బాస్ సీజన్ 5 లో నాకు అందరూ క్లోజ్.. కానీ నా మద్దతు మాత్రం ప్రియాంకకి ఉంటుందని నాగబాబు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story