Akkineni Nagarjuna - Joseph : పిల్లల పట్ల మీరు వ్యవహరించిన తీరుకి హ్యాట్సాఫ్..!

Akkineni Nagarjuna - Joseph :  పిల్లల పట్ల మీరు వ్యవహరించిన తీరుకి హ్యాట్సాఫ్..!
Akkineni Nagarjuna - Joseph : టాలీవుడ్ క్యూట్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత తమ మూడేళ్ళ వివాహ బంధానికి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

Akkineni Nagarjuna - Joeshph : టాలీవుడ్ క్యూట్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత తమ మూడేళ్ళ వివాహ బంధానికి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. "భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం.. మా ఇద్దరి మధ్య దశాబ్ద కాల స్నేహబంధం ఉంది. ఇకపై కూడా ఆ స్నేహబంధం అలాగే కొనసాగుతుందని మేం ఆశిస్తున్నాం.. మేం మా జీవితాల్లో మరింత ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రైవసీని మాకు ఇవ్వండి " అని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.

వీరు విడాకులు ప్రకటించగానే.. నాగచైతన్య తండ్రి, సినీ హీరో అక్కినేని నాగార్జున చాలా హుందాగా స్పందించారు. "చైసామ్‌‌‌లు విడిపోవటం నిజంగా దురదృష్టకరం, భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతం, సమంత, చైతన్య ఇద్దరూ నాకు దగ్గరివాళ్లు.. సమంతతో గడిపిన క్షణాలను నా కుటుంబం ఎప్పటికి గుర్తుంచుకుంటుంది. ఆమె ఎప్పటికీ మాకు దగ్గరి మనిషే.. వాళ్లిద్దరికీ దేవుడు శక్తిని ఇచ్చి ఆశీర్వదించాలి" అని అందరూ వాళ్ళకి మద్దతు పలుకుతూ వాళ్ళ ప్రైవసీని గౌరవించండి అంటూ పెద్దరికంతో పోస్ట్ చేశారు నాగార్జున.

ఇక అటు సమంత తండ్రి మాత్రం విడాకుల ప్రకటన వచ్చిన రెండు రోజుల తర్వాత స్పందించారు.అమ్మాయి తండ్రి కావడంతో కాస్త ఆచితూచి స్పందించారాయన.. విడాకుల విషయం తెలిసి తన మైండ్ బ్లాంక్ అయిపోయింది అన్నారు.అయితే సమంత అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొని ఉంటుంది అని చెప్పారు. త్వరలోనే అన్ని పరిస్థితులు సద్దుమణుగుతాయని ఆశిస్తున్నట్టుగా వెల్లడించారు.

వీళ్ళు ఎంత పెద్ద కుటుంబానికి చెందిన వాళ్ళే అయినా.. పిల్లల విషయానికి వచ్చేసరికి ఒక సాధారణ తల్లిదండ్రుల లాగే వ్యవహరించారు. తమ బిడ్డలైనా సమంత, నాగచైతన్యల మీద ప్రేమను చూపించారు... వాళ్లకి ధైర్యాన్ని చెప్పారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, వాళ్ల స్వేచ్ఛను గౌరవించి మద్దతు పలికారు. పిల్లల పట్ల వీరు వ్యవహరించిన తీరు పట్ల నెటిజన్లు వారి పైన పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story