Payal Rajput: స్టేజ్‌పైనే బాయ్‌ఫ్రెండ్‌కు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్..

Payal Rajput: స్టేజ్‌పైనే బాయ్‌ఫ్రెండ్‌కు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్..
Payal Rajput: పాయల్ ప్రొఫెషనల్ లైఫ్ ఇలా ఉండగా పర్సనల్ లైఫ్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తోంది.

Payal Rajput: తెలుగులో ఎంట్రీ ఇవ్వగానే బోల్డ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది పాయల్ రాజ్‌పుత్. 'ఆర్ఎక్స్ 100'లాంటి సినిమాలో ఇందులాంటి పాత్రలో ఒదిగిపోయిన పాయల్.. మొదటి చిత్రంతోనే ప్రేక్షకులపై ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సినిమాలోనే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా అమ్మడి బోల్డ్‌నెస్ మామూలుగా ఉండదు. తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌కు స్టేజ్‌పైనే లిప్ లాక్ ఇచ్చి తనతో పాటు ప్రేక్షకులకు కూడా షాక్ ఇచ్చింది పాయల్.

పాయల్ రాజ్‌పుత్ కెరీర్ టాలీవుడ్‌లో చాలా గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. చిన్న సినిమాగా మొదలయిన ఆర్ఎక్స్ 100.. తెలుగులో ఓ సెన్సేషనే క్రియేట్ చేసింది. కానీ దాని తర్వాత పాయల్ తన కెరీర్‌ను సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయింది. వెంకటేశ్‌లాంటి సీనియర్ నటుడితో కలిసి నటించిన పాయల్‌కు లక్ కలిసి రాలేదు.

పాయల్ ప్రొఫెషనల్ లైఫ్ ఇలా ఉండగా పర్సనల్ లైఫ్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తోంది. పాయల్.. చాలాకాలంగా సౌర‌భ్ దింగ్రా అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. సోషల్ మీడియాలో వీరి ఫోటోలు, వీడియోలు చూస్తే వీరిది చాలా సీరియల్ రిలేషన్‌షిప్ అని అర్థమవుతుంది. తాజాగా ఓ ఈవెంట్‌లో తన బాయ్‌ఫ్రెండ్‌తో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన ఈ నటి.. చివరిలో తనకు లిప్ లాక్ ఇచ్చి షాక్ ఇచ్చింది. దీంతో బయట కూడా పాయల్ బోల్డ్ బ్యూటీ అని మరోసారి నిరూపించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story