20 నిమిషాల పాత్ర కోసం కోటి రూపాయలు డిమాండ్!

ప్రస్తుతం ఈ బుట్టబొమ్మకు మంచి అవకాశాలు వస్తుండటంతో ఇందుకు అనుగుణంగా రెమ్యూనరేషన్‌ను పెంచేస్తోంది.

20 నిమిషాల పాత్ర  కోసం కోటి రూపాయలు డిమాండ్!
X

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే నానుడిని హీరోయిన్ పూజా హెగ్డే సరిగ్గా ఫాలో అవుతోంది. ప్రస్తుతం ఈ బుట్టబొమ్మకు మంచి అవకాశాలు వస్తుండటంతో ఇందుకు అనుగుణంగా రెమ్యూనరేషన్‌ను పెంచేస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ-చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఆచార్య' చిత్రంలో చరణ్‌కు జోడీగా ఈమెను తీసుకున్నట్లు టాక్ రాగా.. ఇందుకోసం ఈమె భారీగా వసూలు చేసిందట.

ఈ సినిమాలో 20 నిముషాలు ఉండే పాత్ర కోసం ఏకంగా రూ.1కోటి పారితోషికాన్ని తీసుకుంటోందని ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా చిరంజీవి సినిమాను నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి దశ చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాని మే 7 విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సినిమా పైన భారీ అంచనాలున్నాయి!

Next Story

RELATED STORIES