Prakash Raj : ఆ బాధేంటో నాకు తెలుసు... భరించలేని నొప్పి ..!

Prakash Raj :  ఆ బాధేంటో నాకు తెలుసు... భరించలేని నొప్పి ..!
Prakash Raj : ఎంతో అన్యోన్యంగా కనిపించే టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు.

Prakash Raj : ఎంతో అన్యోన్యంగా కనిపించే టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. ఎప్పుడు చిలకగోరింకల్లా ఉంటారనుకున్న ఈ జంట మూడేళ్ళకే విడిపోతూ అభిమానులకి షాక్ ఇచ్చారు. వీరి విడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలావుండగా వీరు విడిపోవడం పట్ల సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించాడు. చైసామ్ ఇద్దరు విడాకులు తీసుకోవడం నిజంగా బాధాకరం. అయితే ఇది వారి వ్యక్తిగత విషయం.. వారి నిర్ణయాన్ని గౌరవించాలి. నాకూడా గతంలో ఒకసారి విడాకులయ్యాయి. కాబట్టి ఆ బాధేంటో నాకు తెలుసు. చాలా ప్రేమించి ఒక్కటై, కొన్ని సంవత్సరాల తర్వాత విడిపోవడం అనేది భరించలేని నొప్పి" అంటూ ప్రకాష్ రాజ్ తెలిపాడు.

Tags

Read MoreRead Less
Next Story