Sonu Sood Help : హ్యాట్సాప్ సోనూసూద్.. మరోసారి రియల్ హీరో అనిపించుకున్నావ్..!

Sonu Sood Help : హ్యాట్సాప్  సోనూసూద్.. మరోసారి రియల్ హీరో అనిపించుకున్నావ్..!
Sonu Sood Help : మరోసారి దాతృత్వం చాటుకున్నాడు రియల్ హీరో సోనూసూద్.. ఓ చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించాడు. ఖమ్మం జిల్లాకి చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతులకు ఈ ఏడాది ఓ బాబు పుట్టాడు.

Sonu Sood Help : మరోసారి దాతృత్వం చాటుకున్నాడు రియల్ హీరో సోనూసూద్.. ఓ చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించాడు. ఖమ్మం జిల్లాకి చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతులకు ఈ ఏడాది ఓ బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టుకతోనే గుండెల్లో సమస్య ఏర్పడింది. దీనిని గుర్తించిన వైద్యులు.. ఆపరేషన్ చేసేందుకు రూ. ఆరు లక్షలు ఖర్చు అవుతాయని తెలిపారు.

కృష్ణ ఓ ప్రైవేటు ఉద్యోగి కావడంతో చిన్నారి వైద్యం కోసం అంత డబ్బు లేకపోవడంతో తల్లడిల్లిపోయాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తిరువూరులో ఉన్న జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు తెలుసుకుని సినీనటుడు సోనూసూద్‌కు తెలిపారు. దీనిపైన వెంటనే స్పందించిన సోనూసూద్..వారిని ముంబై రప్పించుకున్నారు.


అక్కడ వాడియా ఆస్పత్రిలో ఆ బాబుకు శనివారం గుండె ఆపరేషన్‌ చేయించారు. ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. ప్రస్తుతంచిన్నారి ఆరోగ్యం కూడా బాగుందని వైద్యులు వెల్లడించారు. వెంటనే స్పందించి చిన్నారికి ఊపిరి పోసినందుకు గాను సోనూసూద్ కి కృష్ణ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా లాక్ డౌన్ టైంలో చాలా మందికి హెల్ప్ చేసి అందరిచేత రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్.

Tags

Read MoreRead Less
Next Story