ఎనిమిదేళ్ళ విరామం తర్వాత... ప్రభాస్ సినిమాతో రీఎంట్రీ..!

మంచు మనోజ్ హీరోగా వచ్చిన 'పోటుగాడు' చిత్రంలో వైదేహిగా కనిపించి ప్రేక్షకుల్ని అలరించిన ఆమె.. అవకాశాలు లేకపోవడంతో తెలుగు తెరకు దూరమైంది.

ఎనిమిదేళ్ళ విరామం తర్వాత... ప్రభాస్ సినిమాతో రీఎంట్రీ..!
X

దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తోంది నటి సిమ్రన్ కౌర్. మంచు మనోజ్ హీరోగా వచ్చిన 'పోటుగాడు' చిత్రంలో వైదేహిగా కనిపించి ప్రేక్షకుల్ని అలరించిన ఆమె.. అవకాశాలు లేకపోవడంతో తెలుగు తెరకు దూరమైంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'రాధేశ్యామ్'లో ఓ రోల్ లో మళ్లీ సందడి చేయనుంది. ఈ వింటేజ్ ప్రేమకథలో పూజా హెగ్డ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. భాగ్యశ్రీ కీలకపాత్రలో కనిపించనున్నారు. కే రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story

RELATED STORIES