మళ్లీ మొదలైన రీఎంబర్స్‌మెంట్ రగడ

* ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై కాలేజీల మండిపాటు
* ఫిబ్రవరి 10లోగా నిధులు ఇవ్వాలని డిమాండ్
* లేదంటే కాలేజీలు మూసివేస్తామని హెచ్చరికలు
ఫీజురీఎంబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలను కాలేజీలు మండిపడుతున్నాయి. విద్యా సంవత్సరం ముగుస్తున్నా నిధులు విడుదలచేయలేని సర్కార్... తప్పు తమపై నెట్టివేస్తుందని ఆరోపిస్తున్నాయి. వచ్చే పదో తేదీలోగా రీఎంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీలు మూసివేస్తామని యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి.
బడుగుల ఫీజులపై కాలేజీలకు ప్రభుత్వానికి మధ్య మళ్లీ గొడవ మొదలైంది. తప్పు మీదంటే... కాదు మీదంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొంటున్నారు. ఫీజురీఎంబర్స్‌మెంట్‌పై వేసిన కేబినేట్ సబ్‌కమిటీలోని మంత్రులు జిల్లాల్లో కాలేజీప్రిన్సిపాల్స్‌తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాలేజీల నిర్లక్ష్యం కారణంగానే రీఎంబర్స్‌మెంట్ విడుదల ఆలస్యం అవుతుందని ఆరోపణలు చేస్తున్నారు.
మంత్రి పార్థసారధి విజయవాడలో,మరోమంత్రి పితాని సత్యనారాయణ రంగారెడ్డి జిల్లాల్లోని సమావేశాల్లో కాలేజీలను తప్పుబట్టారు. కాలేజీలు, ప్రతిపక్షాలు కావాలనే ఫీజురీఎంబర్స్‌మెంట్‌పై ఆరోపణలు చేస్తున్నాయని మంత్రులు ఎదురుదాడికి దిగారు. మంత్రులు చేస్తున్న ఆరోపణలను వృత్తివిద్యా కాలేజీ యాజమాన్యాలు తప్పుపడుతున్నాయి.
మరో రెండు నెలల్లో విద్యాసంవత్సరం ముగుస్తున్నప్పటికీ సర్కార్ నిధుల విడుదలలో జాప్యం చేస్తోందంటున్నారు కాలేజీ యజమానులు. రీఎంబర్స్‌మెంట్ విడుదల ఆలస్యం కావడంతో కాలేజీలు నడపడం కష్టమవుతుందంటున్నారు వారు. ఫిబ్రవరి 10 వ తేదీని ప్రభుత్వానికి టార్గెట్ పెడుతున్నారు.
అప్పటిలోగా నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వృత్తివిద్యా కాలేజీలను మూసివేస్తామని హెచ్చిరిస్తున్నారు. కాలేజీలు మూసివేస్తామని యాజమాన్యాలు హెచ్చరిస్తుండటంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. మరి రీఎంబర్స్‌మెంట్‌పై సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Published Date : Saturday, 4/2/2012 2:42 PM IST .

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |