Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
మద్యం సిండికేట్ల ఆరోపణలపై మోపిదేవి వివరణ


AA

* రాజాబాబూ నా క్లోజ్‌ ఫ్రెండ్‌: మోపిదేవి
* రమణ క్రిమినల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న వ్యక్తి: మోపిదేవి
* గంజాయి స్మగ్లర్‌, డెకాయిట్‌, మర్డర్‌ కేసులు ఉన్న వ్యక్తి రమణ: మోపిదేవి
* రమణ ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు: మోపిదేవి
* మద్యం సిండికేట్లను కట్టడి చేశాం: మోపిదేవి
* MRPకి విక్రయించని షాపులపై కేసులు పెట్టాం: మోపిదేవి
* సిండికేట్లతో సంబంధం లేకున్నా ACBకి నా పేరు చెప్పడం దుర్మార్గం: మోపిదేవి
* ACB నా వివరణ తీసుకోలేదు: మోపిదేవి
* వ్యాపారస్థులు, సిండికేట్లకు నేను కంట్లో నలుసులా మారాను: మోపిదేవి
* నాపై ఆరోపణలు చేస్తే ఇష్యూ డైవర్ట్‌ అవుతుందనే ఈ కుట్ర: మోపిదేవి
* స్పష్టమైన విచారణ జరిపించండి, ఆరోపణలు వాస్తవమైతే రాజీనామా చేస్తా: మోపిదేవి
* త్వరలోనే విచారణ జరిపించాలని సీఎంకు చెప్పా: మోపిదేవి
* నిజం నిరూపించుకోవడానికి ఎలాంటి విచారణకైనా సిద్ధమే: మోపిదేవి
* ఏ విచారణ జరిపించాలన్నది ముఖ్యమంత్రిదే నిర్ణయం: మోపిదేవి

రమణ అనే క్రిమినల్ ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా ఏసీబీ రిమాండ్ రిపోర్టులో తన పేరు చేర్చడాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఖండించారు. నివేదికలో పేరు చేర్చే ముందు తనను ఒకసారి వివరణ అడిగితే బాగుండేదన్నారు. మద్యం సిండికేట్లకు తాను కంట్లో నలుసుగా మారడంవల్లే తనపై కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని.. అందులో దోషిగా తేలితే..మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మోపిదేవి స్పష్టం చేశారు.

Published Date : Wednesday, 8/2/2012 1:22 PM IST
Related Articles
Gallery