Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఏసీబీ దాడుల్లో వెలుగుచూస్తున్న నమ్మలేని నిజాలు


AA

* డబ్బులు వెదజల్లి మేనేజ్‌ చేసిన లిక్కర్‌కింగ్‌లు
* పోలీస్‌, ప్రెస్‌, ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌లకు ముడుపులు
* అడ్డుతగిలే అందరినీ ప్రసన్నం చేసుకున్న సిండికేట్లు
* సిండికేట్లతో మందుబాబుల జేబులకు భారీగా చిల్లు
* ముడుపుల లెక్కలు రాసిపెట్టిన నెల్లూరు సిండికేట్లు
* అడ్డుతగిలేవారి స్థాయినిబట్టి డబ్బులు సమర్పణ
* దసరా మామూళ్ల రూపంలో అధికారులకు ముడుపులు
* ప్రతి ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌కూ వాటాలు
* 10లక్షలు మేసిన కొవూరు ఎక్సైజ్‌ ఎస్సై విజయ్‌కుమార్‌
* లక్షా 70వేలు దండుకున్న డి.సి అండ్‌ ఈ.ఎస్‌ అధికారులు
* దగదర్తి ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ వాటా లక్షా 50వేలు
* ప్రెస్‌ రిపోర్టర్లనూ ప్రసన్నం చేసుకున్న లిక్కర్‌మాఫియా
* అక్రమ వ్యాపారంపై వార్తలు రాయకుండా ముడుపులు

మద్యం సిండికేట్లపై ACB జరిపిన సోదాల్లో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ప్రతిజిల్లాలోనూ లిక్కర్‌ కింగ్‌లు.. డబ్బును మంచినీళ్లలా వెదజల్లారు. పోలీస్‌, ప్రెస్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎక్సైజ్‌.. ఇలా ప్రతిఒక్కరినీ ప్రసన్నం చేసుకుని కేటుగాళ్లు కథ నడిపించారు. నెల్లూరు జిల్లాలో మద్యం మాఫియా రెండో జాబితా విడుదల చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా మద్యం సిండికేట్లపై ACB జరిపిన దాడుల్లో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా కేటుగాళ్లు డబ్బు వెదజల్లి తమ పని కానిచ్చారు. ఎక్సైజ్‌, పోలీస్‌, ప్రెస్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌.. ఇలా తమకు అడ్డుతగిలే అందరినీ ప్రసన్నం చేసుకుని మద్యం మాఫియా ఆగడాలు వెలుగులోకి రాకుండా మేనేజ్‌ చేశారు. దీంతో మందుబాబుల జేబులకు భారీగా చిల్లుపడింది. ఏసీబీ రంగంలోకి దిగడంతో రాష్ట్రంలో మద్యం మాఫియా ఎలా విస్తరించిందో అర్ధమవుతోంది.

పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మద్యం సిండికేట్లు.. ఎవరెవరికి ఎంతిచ్చారో లెక్కలు సైతం రాసిపెట్టారు. 4వందల నుంచి 10లక్షల వరకూ.. అడ్డుతగిలేవారి స్థాయిని బట్టి ముట్టచెప్పారు. కోవూరు ఎక్సైజ్‌ ఎస్సై విజయ్‌కుమార్‌ ఏకంగా 10లక్షలు మేసి తానేంటో నిరూపించాడు. తర్వాత దసరా మామూళ్ల రూపంలో డి.సి అండ్‌ ఈ.ఎస్‌ ఆఫిస్‌ అధికారులు లక్షా 70వేలు దండుకున్నారు. దగదర్తి ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌కు లక్షా 50వేలు ముట్టచెప్పారు.

ప్రతి ఎక్సైజ్‌ స్టేషన్‌కు ముడుపుల రూపంలో ఎంతోకొంత సమర్పించారు లిక్కర్‌కింగ్‌లు. అక్రమ వ్యాపారంపై వార్తలు రాయకుండా ప్రెస్‌ రిపోర్టర్లనూ ప్రసన్నం చేసుకుంది లిక్కర్‌ మాఫియా. స్థాయిని బట్టి నాలుగొందల నుంచి 10వేల దాకా ఇచ్చుకున్నారు. కేవలం ఓ ఎక్సైజ్‌ కానిస్టేబులే 10వేలు ముక్కుపిండి మరీ వసూలు చేశాడంటే.. మిగతా పెద్దలకు ఎంత ముట్టిందో అర్ధం చేసుకోవచ్చు.

Published Date : Thursday, 9/2/2012 ౩:20 PM IST
Related Articles
Gallery