ఇంకా వీడని హ్యాకింగ్ చిక్కులు

* ట్రెజరీలో నిలిచిపోయిన బిల్లులు
రాష్ట్రాన్ని హ్యాకింగ్ చిక్కులు వీడడం లేదు. ప్రభుత్వ వెబ్ సైట్లను వరుసగా హ్యాక్ చేస్తూ ఐటీ అధికారులను హ్యాకర్లు షేక్ చేస్తున్నారు. శనివారం మరిన్ని సర్వర్లు స్థంభించడంతో కీలక లావాదేవీలు నిలిచిపోయాయి. ట్రెజరీ చెల్లింపులు లేక పలు శాఖల రోజువారి విధులకు ఆటంకం కల్గుతోంది.
మరోవైపు ప్రభుత్వ వెబ్ సైట్లు వరుసగా హ్యాక్ అవుతున్నా అధికారులు మొద్దు నిద్ర వీడకపోవడంపై ఐటీ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సర్కారుకు హాకర్లు చుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వ వెబ్ సెట్లను వరసగా హ్యాక్ చేస్తూ ఐటీ అధికారులకు వణుకు పుట్టిస్తున్నారు. బడ్జెట్ కు ముందు రోజు ఆర్థిక శాఖతో పాటు కీలక వెబ్ సెట్లలోకి చొరబడి కలకలం రేపిన టెక్ దొంగలు , శనివారం మరిన్ని ప్రభుత్వ సైట్లకు వైరస్ ఎక్కించారు.
దీంతో సచివాలయం సర్వర్లు మరోసారి స్థంభించడంతో పలు శాఖల లావాదేవీలకు అంతరాయం కల్గింది. క్లియరెన్స్ రాక ట్రెజరీ బిల్లులు నిలిచిపోయాయి. సర్కారు వెబ్ సైట్లు హ్యాక్ కావడంతో కలవరపడ్డ ఐటీ అధికారులు, తస్కరణకు గురైన ప్రభుత్వ శాఖల డేటాను పునరుద్దరించటానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొన్ని సైట్లలోని వైరస్ ను తొలగించినప్పటికి పరిస్థితి మాత్రం పూర్తిగా అదుపులోకి రాలేదని తెలుస్తోంది.
కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ప్రభుత్వ వెబ్ సెట్ల హ్యాకింగ్ పై రాష్ట్ర అధికారులను గట్టిగానే మందలించినట్టు సమాచారం. మరోవైపు వెబ్ సైట్ల హ్యాకింగ్ పై సర్కారు నోరుమెదపడం లేదు. శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిపి ఐటీ అధికారులు చేతులు దులిపేసుకున్నారు. దీంతో విచారణ అంతంతమాత్రంగానే సాగుతోంది. రాష్ట్ర అధికారుల నిర్లక్ష్యంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.
Published Date : Monday, 20/2/2012 3:41 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |