Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఇవాళ అసెంబ్లీ పునఃప్రారంభం


AA

* బడ్జెట్‌పై చర్చించనున్న సభ
* ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేయనున్న విపక్షాలు
* కేటాయింపులపై మండిపడుతున్న పార్టీలు

సభా సమరానికి మళ్లీ రంగం సిద్ధమైంది. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత తిరిగి ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవనున్నాయి. బడ్జెట్‌ను ఇప్పటికే అంకెల గారడీతో పోల్చిన విపక్షాలు, ఇదే అంశంపై అధికారపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు తెలంగాణపై టీఆర్‌ఎస్‌, మద్యం మాఫియాపై టీడీపీ ఆందోళన చేపట్టే అవకాశముంది.

ష్ట్ర బడ్జెట్‌పై చర్చించేందుకు ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశం కానుంది. సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత మూడ్రోజుల పాటు వాయిదా పడ్డ సభ, వాడీ వేడి చర్చకు రెడీ అయింది. బడ్జెట్‌ కేటాయింపుల్ని అంకెల గారడీగా విమర్శిస్తున్న విపక్షాలు ఇప్పటికే ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.

సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారని, పేద ప్రజలను పట్టించుకోవడం లేదని పార్టీలన్నీ ముక్తకంఠంతో కిరణ్‌ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అసెంబ్లీ వేదికగా మరోసారి గళం విప్పేందుకు విపక్షాలన్నీ సిద్ధమవుతున్నాయి. ఉప ఎన్నికలకు సమయం కూడా దగ్గర పడుతుండడంతో, అసెంబ్లీలో ఫోకసయ్యేందుకు పార్టీలన్నీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.

అటు తెలంగాణపై తీర్మానం కోసం సభను స్తంభింపజేసేందుకు టీఆర్‌ఎస్‌ రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ అంశంపై సభలో చర్చకు పట్టుపడుతున్న గులాబీ దళం, ఇవాళ్టి నుంచి మరోసారి గళం విప్పనుంది. ఉప ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున బడ్జెట్‌ను వాయిదా వేయాలని పట్టుబట్టిన టీఆర్‌ఎస్‌ సభ్యులు, ఆ రోజు సభ నుంచి సస్పెండయ్యారు. దీనిపై టీఆర్‌ఎస్‌ తీవ్ర ఆగ్రహంగా ఉంది.

ఇదే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు టీఆర్‌ఎస్‌ సభ్యులు రెడీ అవుతున్నారు.ఇక మద్యం మాఫియాపై చర్చకు పట్టుపడుతున్న టీడీపీ, అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ఇవాళ్టి నుంచి మరింత గొంతు పెంచనుంది. మద్యం మాఫియాపై ఏసీబీ రిపోర్టును బయటపెట్టాలని డిమాండ్‌ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు ఇవాళ కూడా సభను స్తంభింపజేసే అవకాశముంది. మొత్తానికి అధికార పక్షం, విపక్షాలు మాటల యుద్ధానికి సిద్ధమవడంతో అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

Published Date : Tuesday, 21/2/2012 10:46 AM IST
Related Articles
Gallery